దిల్లీ నుంచి వస్తున్నారా?.. కరోనా పరీక్షకు రండి..
close

తాజా వార్తలు

Published : 22/11/2020 22:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ నుంచి వస్తున్నారా?.. కరోనా పరీక్షకు రండి..

లక్నో: కొన్ని నెలలుగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దిల్లీ, దాని చుట్టపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.  రాష్ట్ర్రంలోని గౌతమ్‌ బుద్ధ నగర్‌లో దేశ రాజధాని నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ నుంచి వచ్చిన ప్రయాణికులకు  కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ‘దేశ రాజధానిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి విమానం, బస్సు, రైళ్లలో వచ్చిన వారికి మేం కరోనా పరీక్షలు చేస్తాం. పండగలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు ఎంత మేరకు ప్రజలు హాజరుకావాలనే దానిపై చర్చిస్తున్నాం’అని రాష్ట్ర్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్‌కే తివారీ ఆదివారం మీడియాకు తెలిపారు.  దిల్లీలో అక్టోబర్‌ చివరి నుంచి ఇప్పటి వరకు కొవిడ్‌-19 కేసులు పెరిగుతున్నాయి.  శనివారం దేశ వ్యాప్తంగా నమోదయిన కరోనా కేసుల్లో ఎక్కవ శాతం దిల్లీలో నమోదయ్యాయి.  ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోకరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో కేంద్రం ముగ్గురు సభ్యుల బృందాన్ని రాష్ట్ర్రానికి పంపే యోచనలో ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర్రంలో 24 మంది కరోనాతో మరణించారు. 2,326 కొత్త కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 5,24,223కి పెరిగింది.  ప్రస్తుతం రాష్ట్ర్రంలో 23,471 క్రియాశీల కేసులు ఉన్నాయి.  నవంబర్‌లో 1.6 శాతం కరోనా పాజిటివిటీ పెరిగింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని