హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా
close

తాజా వార్తలు

Published : 14/12/2020 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా

40 మందికి గాయాలు.. 20 మంది పరిస్థితి విషమం

కటక్‌: ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కోక్‌సొర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 40 మందికి గాయాలవగా.. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భారీ మలుపును డ్రైవర్‌ గుర్తించలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

ఇదీ చదవండి..

బెంగాల్‌లో కేంద్ర బలగాలని దింపాలి: భాజపా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని