close

తాజా వార్తలు

Published : 14/07/2020 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అంబేడ్కర్‌ మ్యూజియంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మ్యూజియంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యుడు ఎం.రాధాకృష్ణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంబైలో దాదార్‌ హిందుకాలనీలో ఉన్న రాజ గృహంలో మూడు అంతస్తుల ఇంటిలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి పూలకుండీలు, ఫర్నీచర్‌, గ్రంథాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరగణిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తోందన్నారు. దీనిలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌రెడ్డి ఆదేశాలతో మంగళవారం అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి గోవిందు శంకర్‌ శ్రీనివాస్‌, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు అన్నపురెడ్డి వినయరాజ్‌, అద్దంకి అనిల్‌కుమార్‌, నసిరుద్దీన్‌ పాల్గొన్నారు.

నరసరావుపేట లీగల్‌ : భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నివాసం రాజ గృహంపై దుండగులు దాడి చేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ సుధాకర్‌ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కట్టడి చేయడంలో భాజపా విఫలమైందని, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేయడంలో ప్రజల దృష్టి మరల్చేందుకు రాజ గృహంపై దాడి చేశారని చెప్పారు. రహమాన్‌, బాబి తదితరులు పాల్గొన్నారు.

దుర్గి : ముంబైలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని సోమవారం స్థానిక బస్టాండ్‌లో డీబీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు పేరుపోగు జార్జి, వడ్డే మధుసూదనరావు, రాణి, తదితరులు పాల్గొన్నారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని