‘నేనేంటో చూపిస్తా’.. సర్పంచ్‌ అభ్యర్థి వీరంగం
close

తాజా వార్తలు

Updated : 03/02/2021 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నేనేంటో చూపిస్తా’.. సర్పంచ్‌ అభ్యర్థి వీరంగం

కావలి: నెల్లూరు జిల్లా కావలి గ్రామీణ మండల వైకాపా అధ్యక్షుడు రాఘవులు వీరంగం సృష్టించారు. మండలంలోని చెంచుగానిపాలెం సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేసిన ఆయన.. ఏకగ్రీవంగా ఎన్నికవుతానని భావించారు. అయితే అనూహ్యంగా జ్వాలారావు అనే వ్యక్తి తనకు పోటీగా నామినేషన్‌ వేయడంతో రాఘవులు తట్టుకోలేకపోయారు. ఆగ్రహం కట్టలు తెంచుకుని ఊరి నడిబొడ్డున నిలబడిన రాఘవులు.. తానేంటో చూపిస్తానంటూ రెచ్చిపోయి తిట్ల దండకాన్ని అందుకున్నారు. ఇదంతా చూస్తున్న గ్రామస్థులు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు.

తణుకులో వర్గపోరు..

 మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వర్గపోరు బయటపడింది. తణుకు మండలం వేల్పూరులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ చిట్టూరి సునంద తమ వర్గీయులతో నామినేషన్లు వేయించారు. రెండు వర్గాలు ఎన్నికల బరిలో నిలవడంతో ఏం చేయాలో తెలియక వైకాపా శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ ఎమ్మెల్యే కారుమూరిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన తణుకు మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బలగం సీతారాం, బీసీ నేత కడియాల సూర్యనారాయణ.. సునంద వర్గానికి మద్దతుగా నిలిచారు. మరోవైపు పీవీఆర్‌ వర్గానికి మద్దతుగా ఎమ్మెల్యే కారుమూరి నిలిచారు. ఈ పరిణామాలతో పోరు మరింత రసవత్తరంగా మారింది.

ఇవీ  చదవండి..

కర్నూలులో మంత్రుల సమావేశం రసాభాస

ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని