close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బహిష్కరణ మంచిదికాదు

సభ సజావుగా నిర్వహించడం అన్ని పక్షాల బాధ్యత
సమావేశాల ముగింపులో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: ఒక దురదృష్టకర సంఘటన తప్ప రాజ్యసభ వర్షాకాల సమావేశాలు అద్భుతంగా సాగాయని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో అనుకున్న సమయానికి 8 రోజుల ముందుగానే సభను నిరవధిక వాయిదా వేసిన సందర్భంగా ఆయన బుధవారం పెద్దల సభ సభ్యులనుద్దేశించి మాట్లాడారు.
‘‘గత ఆదివారం సభలో చోటుచేసుకున్న తరహా సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని సభ్యులను మనస్ఫూర్తిగా కోరుతున్నా. సభానిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని 1997, 2012లో సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. దానికి కట్టుబడి ఉంటే సభ సజావుగా సాగేది. అన్ని పక్షాల సభ్యులూ అందుకు సహకరించాలి. అప్పుడే ప్రజలు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం సాధ్యమవుతుంది. 22 ఏళ్లుగా ఈ సభతో అనుబంధం ఉంది కాబట్టి బిల్లులు ఎప్పుడు గందరగోళంలో పాసైనా ఆవేదన కలుగుతుంది. సభలో గందరగోళం చెలరేగినప్పుడు అధ్యక్షుడిగా విధిలేని పరిస్థితుల్లో సభ్యులపై చర్యలు తీసుకోవాల్సి రావడం కూడా నన్ను బాధిస్తుంది. సభా గౌరవమర్యాదలను కాపాడటానికి అలా చేయకతప్పదు. సభలో జరుగుతున్న విషయాల గురించి నాకు ఎన్నో ఫోన్లు, వాట్సప్‌ సందేశాలు వస్తున్నాయి. దాన్ని బట్టి ప్రజలు సభా కార్యకలాపాలను గమనిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానప్రతిపక్ష నేత హోదాను తగ్గించారని గులాంనబీ ఆజాద్‌ ఆవేదన వ్యక్తంచేశారు. కానీ అది ఏ సమయంలో జరిగిందన్నది ఆయన చెప్పలేదు.  కానీ సభాధ్యక్షుడిగా సభానిర్వహణకు సంబంధించిన ఏ అంశంలోనైనా తుది నిర్ణయానికి రాకముందు ఆయన అభిప్రాయం తీసుకొనే ముందుకుపోయాను. సభలో ప్రధానప్రతిపక్ష నేత చాలా ముఖ్యం కాబట్టి వారి పాత్రను నీరుగార్చడం అన్నది ఊహాతీతం. ఆదివారం కొందరు సభ్యులు తమ చర్యలను వారే వీడియో తీసుకొని వైరల్‌ చేశారు. కానీ వాళ్లకు వాళ్లే తమ చర్యలను బయటపెట్టుకుంటున్నామన్న విషయాన్ని అర్థంచేసుకోలేకపోయారు. ఇకముందు సభలో ఫోన్లను ఉపయోగించడం మానేయండి. అది సభా నిబంధనలకు విరుద్ధం’’ అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.


సభ జరిగిన తీరిదీ...

* 10 రోజులు - 25 బిల్లులకు ఆమోదం
* 6 కొత్త బిల్లుల ప్రవేశం. 25 బిల్లులకు ఆమోదం
* 18 రోజులకు సభ షెడ్యూల్‌. 8 రోజుల ముందే ముగింపు.
* షెడ్యూల్‌ సమయం 38.30 గంటలకుగాను 38.41 గంటలు సాగిన సభ
* ఆందోళనల వల్ల 3.15 గంటల సమయం వృథా. దానివల్ల 3.26 గంటలపాటు అధికంగా సమావేశం
* గత నాలుగు సమావేశాలు కలిపి 96.13% ఉత్పాదకత. గత అయిదేళ్లలో ఇదే అత్యధికం.
* చర్చల్లో పాల్గొన్న 198 సభ్యులు. 1567 లిఖితపూర్వక ప్రశ్నలకు సమాధానం. 92 జీరో అవర్‌, 66 ప్రత్యేక ప్రస్తావనలు. ఇందుకు 4.15 గంటల (10.99%) సమయం.
* లద్దాఖ్‌, కరోనా అంశంపై చర్చకు 4.28 గంటల (11.55%) సమయం.
* తొలిసారి డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు.. తిరస్కారం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.