కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన భాజపా నేత

తాజా వార్తలు

Published : 28/05/2020 23:39 IST

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన భాజపా నేత

దిల్లీ: భారతీయ జనతా పార్టీ (భాజపా) జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆస్పత్రిలో చేరారు. గురుగ్రామ్‌లోని ఆస్పత్రిలో గురువారం ఆయనను చేర్పించారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆ పార్టీ నేతలు అమిత్‌ మాలవీయ, జ్యోతిరాధిత్య సింథియా తదితరులు ట్వీట్లు చేశారు.

భాజపా ముఖ్యుల్లో సంబిత్‌ పాత్రా ఒకరు. టీవీ ఛానెళ్లలో ఆ పార్టీ తరఫున ఎక్కువగా కనిపిస్తుంటారు. సోషల్‌మీడియాలో సైతం పలు అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. గురువారం సైతం కొన్ని ట్వీట్లు చేయడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని