ఆగని దాడులు
close

ప్రధానాంశాలు

Updated : 13/05/2021 05:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగని దాడులు

ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

గాజా సిటీ, జెరూసలెం: ఇజ్రాయెల్‌ బలగాలు, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య దాడుల పరంపర కొనసాగుతోంది. గాజా నుంచి వందల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి హమాస్‌ ప్రయోగిస్తుండగా.. పదుల కొద్దీ వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో అక్కడి పరిస్థితులు 2014 నాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గాజాపై జరిగిన దాడుల్లో మొత్తం 48 మంది పాలెస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. దాదాపు 300 మంది గాయపడ్డారు. మృతుల్లో 14 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. తాజా వైమానిక దాడుల్లో గాజాలోని రెండు పెద్ద అపార్ట్‌మెంట్లు నేలమట్టమయ్యాయి. హెచ్చరికపూర్వకంగా కాల్పులు చోటుచేసుకున్నప్పుడే అపార్ట్‌మెంట్ల నుంచి జనం బయటకు వెళ్లిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
హమాస్‌ ముష్కరుల తాజా రాకెట్‌ దాడులతో ఇజ్రాయెల్‌లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల్లో కేరళకు చెందిన ఓ మహిళ ఉన్నారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదులు ట్యాంకు విధ్వంసక క్షిపణిని ప్రయోగించడంతో ఇజ్రాయెల్‌ సైనికుడొకరు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు హమాస్‌ 1,050కి పైగా రాకెట్లను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా ప్రయోగించిందని.. వాటిలో 200 రాకెట్లు గాజాలోనే పడిపోయాయని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. తమ దేశంలో టెల్‌ అవీవ్‌ సహా పలు నగరాలను హమాస్‌ రాకెట్లు తాకినట్లు వెల్లడించింది. తాము జరిపిన వైమానిక దాడుల్లో గాజా సిటీ కమాండర్‌ బసెమ్‌ ఇసా సహా పలువురు హమాస్‌ సీనియర్‌ ముష్కరులు హతమయ్యారని పేర్కొంది. బసెమ్‌ మరణ వార్తను హమాస్‌ ధ్రువీకరించింది. మరోవైపు- పాలెస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్‌ అనుచితరీతిలో వ్యవహరిస్తోందంటూ టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌కు గట్టి సమాధానం చెప్పాల్సిన తరుణం వచ్చిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఆయన పేర్కొన్నారు.

అమ్మ ఫోన్‌ కోసం ఎదురుచూపులు!
ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్‌ నగరంపై హమాస్‌ ముష్కరులు మంగళవారం జరిపిన రాకెట్‌ దాడుల్లో కేరళ మహిళ సౌమ్య మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే. ఆమె మరణ వార్తను తమ తొమ్మిదేళ్ల కుమారుడు ఏడన్‌ జీర్ణించుకోలేకపోతున్నాడని సౌమ్య భర్త సంతోష్‌ తెలిపారు. అమ్మ ఫోన్‌ చేస్తుందంటూ కుమారుడు ఇప్పటికీ ఎదురుచూస్తున్నాడని చెప్తూ ఆయన రోదించారు. ఇజ్రాయెల్‌ నుంచి కేరళకు శాశ్వతంగా వచ్చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగానే తన భార్య దుర్మరణం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతదేహాన్ని కేరళకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన