నూతన పార్లమెంట్‌కు రాళ్లెత్తిన కార్మికులను గౌరవించాలి

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:51 IST

నూతన పార్లమెంట్‌కు రాళ్లెత్తిన కార్మికులను గౌరవించాలి

అధికారులకు ప్రధాని సూచన

దిల్లీ: నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న ప్రతి కార్మికుడిని గౌరవించాలని అధికారులకు ప్రధాని మోదీ సూచించారు. వారి సేవలను గుర్తిస్తూ, వారి వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపరచాలని అన్నారు. అందులో పేరు, వ్యక్తిగత వివరాలు, ఫొటోను ఉంచాలని తెలిపారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారి పాత్రను ప్రశంసిస్తూ ధ్రువపత్రాలు కూడా ఇవ్వాలని ప్రధాని పేర్కొన్నారు. వీరంతా ఒక చరిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. ఆదివారం సాయంత్రం నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణ పనులను మోదీ ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంజనీర్లు, అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన