Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 85267
            [news_title_telugu_html] => 

నన్ను ఉద్యోగం చేయనివ్వడంలేదు!

[news_title_telugu] => నన్ను ఉద్యోగం చేయనివ్వడంలేదు! [news_title_english] => [news_short_description] => నేను బీటెక్‌ పూర్తి చేశా. ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి హైదరాబాద్‌ వచ్చి ఒక కోర్సులో చేరా. మూడు నెలల శిక్షణ పూర్తయ్యింది. ఇటీవల నా చెల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరొకరిని పెళ్లి చేసుకుంది... [news_tags_keywords] => Self confidence, permission, job, Vasundhara [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-18 00:33:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నన్ను ఉద్యోగం చేయనివ్వడంలేదు! - EENADU
close

తాజా వార్తలు

నన్ను ఉద్యోగం చేయనివ్వడంలేదు!

నేను బీటెక్‌ పూర్తి చేశా. ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి హైదరాబాద్‌ వచ్చి ఒక కోర్సులో చేరా. మూడు నెలల శిక్షణ పూర్తయ్యింది. ఇటీవల నా చెల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరొకరిని పెళ్లి చేసుకుంది. దీంతో నన్ను ‘ఉద్యోగం వద్దు, చదువు వద్దు... ’ అని ఇంట్లోనే ఉంచేశారు అమ్మానాన్న. ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా హైదరాబాద్‌  పంపించడానికి ఇష్టపడటం లేదు. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తెస్తున్నారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదు. మా పిన్ని అమ్మానాన్నకు లేనిపోనివన్నీ చెబుతోంది. అన్నీ వింటుంటే నాకు  ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంది. నేనేం చేయాలో తెలియడంలేదు?

- ఓ సోదరి

 

మన సంస్కృతిలో తల్లితండ్రులు చేసే పొరపాట్లలో ఇది కూడా ఒకటి. మీ చెల్లెలు కుటుంబ సభ్యుల మద్దతు లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. నువ్వు కూడా అదే పొరపాటు చేస్తావనే భయంతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నీవల్ల కూడా పరువు పోతుందని ఆందోళన చెందుతున్నారు. పెళ్లయ్యాక భర్త అనుమతితో ఉద్యోగం చేసుకో అనే ధోరణి వారిలో ఉండొచ్చు. అయితే ఒకరు చేసిన తప్పు అందరూ చేస్తారని మీ తల్లిదండ్రులు అనుకోవడం సమంజసం కాదు. వాళ్లకు కూడా ఓ చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా. మీ చిన్నమ్మాయి చేసింది తప్పే. అబ్బాయి మీ కుటుంబానికి సరిపోతాడా లేదా అనే విషయం ఆలోచించకుండా ఇలా చేయడం బాధాకరమే. ఓసారి పిలిచి మాట్లాడండి. తనవల్ల మీ పెద్దమ్మాయిని ఉద్యోగం చేయనీయకుండా ఇంట్లో ఉంచడం వల్ల ఆమె ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఎంతో విచారించి, ఆలోచించి పెళ్లి చేసినా ఏదయినా ఇబ్బంది వస్తే... తన కాళ్లమీద తాను నిలబడేలా ఉండాలంటే ఉద్యోగం అవసరమే. కాబట్టి మీ అమ్మాయిని దగ్గర్లోనైనా సరే ఏదైనా ఉద్యోగం చేయించండి. ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. మీరు కూడా మీ అమ్మానాన్నలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించండి.

ఇక, మీ యువత కూడా విద్యావంతులుగా మారి, ఆర్థిక స్వేచ్ఛ వచ్చేసరికి తప్పులు చేస్తుంటారు. మీరు ఒక వ్యక్తిని ప్రేమించే ముందు అతన్నే ఎందుకు ఇష్టపడుతున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రేమ వివాహం వరకు వెళ్లేసరికి సమాజం మద్దతు తెలపక పోయినా సరే తల్లిదండ్రులను మాత్రం తప్పకుండా ఒప్పించండి. వాళ్లు ఎంతో కష్టపడితే మీరు ఈ స్థాయికి వచ్చారనే విషయం గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి సరైన వాడు అనిపించి పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ తల్లిదండ్రుల దగ్గర గట్టిగా నిలబడండి. అయితే మీరు ప్రేమించే అబ్బాయిని మీ తల్లిదండ్రులు చూసిన వెంటనే శెభాష్‌ అని అంగీకరించేలా ఉండాలి. అమ్మనాన్నలు మీ బాగోగుల గురించే ఎన్నో విధాలుగా ఆలోచించి మిమ్మల్ని ఒక అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారని మరవకండి. అమ్మనాన్న మిమ్మల్ని ఉద్యోగం వద్దు ఏమి వద్దని అంటుంటే వారిని ఒక కౌన్సెలర్‌ దగ్గరికి తీసుకెళ్లండి. ఎట్టిపరిస్థితుల్లోనూ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకండి. అమ్మనాన్నలను ఒప్పించేలా చూడండి.

మీ ప్రశ్నలు ఇకపై vasupsych@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.