News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (09-08-2022)

Updated : 09 Aug 2022 20:22 IST
1/22
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా ఏర్పాటు చేసిన మువ్వన్నెల విద్యుద్దీపాల వెలుగుల్లో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా ఏర్పాటు చేసిన మువ్వన్నెల విద్యుద్దీపాల వెలుగుల్లో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం
2/22
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ప్రజలకు జాతీయ జెండా ప్రాముఖ్యతను వివరించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై ఎగురవేయాలని ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు పిలుపునిచ్చారు.  స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ప్రజలకు జాతీయ జెండా ప్రాముఖ్యతను వివరించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై ఎగురవేయాలని ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు పిలుపునిచ్చారు.
3/22
కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో జలాశయం ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 884.85 అడుగుల నీరుంది. ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తడంతో శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు జలాశయం అందాలను తిలకిస్తున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో జలాశయం ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 884.85 అడుగుల నీరుంది. ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తడంతో శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు జలాశయం అందాలను తిలకిస్తున్నారు.
4/22
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో పలువురు మోడళ్లు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వారంతా జాతీయ జెండాలు చేతబూని ఇలా ఫొటోకు పోజిచ్చారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో పలువురు మోడళ్లు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వారంతా జాతీయ జెండాలు చేతబూని ఇలా ఫొటోకు పోజిచ్చారు.
5/22
హైదరాబాద్‌లోని చార్మినార్‌ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో మొహర్రం నిర్వహించారు. ముస్లిం సోదరులు పీర్లను ఊరేగిస్తూ గీతాలను ఆలపించారు. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ సీవీ ఆనంద్‌ పీర్ల వద్ద దట్టీ సమర్పించారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో మొహర్రం నిర్వహించారు. ముస్లిం సోదరులు పీర్లను ఊరేగిస్తూ గీతాలను ఆలపించారు. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ సీవీ ఆనంద్‌ పీర్ల వద్ద దట్టీ సమర్పించారు.
6/22
7/22
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, ధ్వజ స్తంభానికి, శ్రీ భూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి పవిత్రమాలలు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, ధ్వజ స్తంభానికి, శ్రీ భూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి పవిత్రమాలలు సమర్పించారు.
8/22
9/22
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా 552 థియేటర్లలో ‘గాంధీ’ చిత్రం ఉచితంగా ప్రదర్శించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శన కొనసాగనుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్‌లో ‘గాంధీ’ సినిమాను వీక్షిస్తున్న విద్యార్థులను ఈ చిత్రంలో చూడొచ్చు. 
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా 552 థియేటర్లలో ‘గాంధీ’ చిత్రం ఉచితంగా ప్రదర్శించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శన కొనసాగనుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్‌లో ‘గాంధీ’ సినిమాను వీక్షిస్తున్న విద్యార్థులను ఈ చిత్రంలో చూడొచ్చు.
10/22
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లోని థ్రిల్‌ సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. శాంతి కపోతాన్ని, మువ్వన్నెల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. అనంతరం 3కె రన్‌ను ఆయన ప్రారంభించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లోని థ్రిల్‌ సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. శాంతి కపోతాన్ని, మువ్వన్నెల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. అనంతరం 3కె రన్‌ను ఆయన ప్రారంభించారు.
11/22
12/22
భారీ వర్షాల కారణంగా ఛత్తీస్‌గడ్‌-తెలంగాణ సరిహద్దులోని టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా ఛత్తీస్‌గడ్‌-తెలంగాణ సరిహద్దులోని టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
13/22
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి ఆకట్టుకున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి ఆకట్టుకున్నారు.
14/22
15/22
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగ నెల్లూరులో ప్రారంభమైంది. బారాషహీద్‌ దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువులో స్నానం చేసి.. రొట్టె తీసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సంపద కావాలనుకునే వారికి ఒక రొట్టె.. చదువు.. ఉద్యోగం.. సొంత ఇల్లు.. ఆరోగ్యం.. వివాహం.. ఇలా ఎవరి కోరికలకు అనుగుణంగా ఇక్కడ రొట్టె తీసుకోనే ఆనవాయితీ ఉంది. ఒక ఏడాది ఇక్కడకు వచ్చి రొట్టె తీసుకుని.. కోరిక తీరిన తర్వాత.. కచ్చితంగా వచ్చి మళ్లీ రొట్టె విడిచి వెళ్లాలన్నది ఆచారం.  మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగ నెల్లూరులో ప్రారంభమైంది. బారాషహీద్‌ దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువులో స్నానం చేసి.. రొట్టె తీసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సంపద కావాలనుకునే వారికి ఒక రొట్టె.. చదువు.. ఉద్యోగం.. సొంత ఇల్లు.. ఆరోగ్యం.. వివాహం.. ఇలా ఎవరి కోరికలకు అనుగుణంగా ఇక్కడ రొట్టె తీసుకోనే ఆనవాయితీ ఉంది. ఒక ఏడాది ఇక్కడకు వచ్చి రొట్టె తీసుకుని.. కోరిక తీరిన తర్వాత.. కచ్చితంగా వచ్చి మళ్లీ రొట్టె విడిచి వెళ్లాలన్నది ఆచారం.
16/22
17/22
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల స్ఫూర్తితో సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట్ మండలం ఆరూర్ గ్రామం నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి 75 కిలోమీటర్ల మేర పాదయాత్రను ప్రారంభించారు. జగ్గారెడ్డి సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమార్తె జయరెడ్డి, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల స్ఫూర్తితో సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట్ మండలం ఆరూర్ గ్రామం నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి 75 కిలోమీటర్ల మేర పాదయాత్రను ప్రారంభించారు. జగ్గారెడ్డి సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమార్తె జయరెడ్డి, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
18/22
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన నేడు లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలకు అర్చకులు అష్టోత్తర కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పవిత్రారోహణం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన నేడు లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలకు అర్చకులు అష్టోత్తర కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పవిత్రారోహణం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు.
19/22
20/22
 హిమాయత్ నగర్ భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో 10 వేల జాతీయ జెండాలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి గడప గడపకు వెళ్లి వీటిని ప్రజలకు అందజేస్తామని ఆయన తెలిపారు. హిమాయత్ నగర్ భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో 10 వేల జాతీయ జెండాలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి గడప గడపకు వెళ్లి వీటిని ప్రజలకు అందజేస్తామని ఆయన తెలిపారు.
21/22
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 7వ రోజుకు చేరింది. మునుగోడు నియోజకవర్గం తాళ్ల సింగారం నుంచి ఆయన ఇవాళ యాత్ర ప్రారంభించారు. దేశం మొత్తం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు జరుపుకొంటున్న నేపథ్యంలో ఆయన తన యాత్రలో జాతీయ జెండాలు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. బండి సంజయ్‌తోపాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా జాతీయ జెండాలతో పాదయాత్రలో పాల్గొనడంతో దారి మొత్తం త్రివర్ణ పతాక రెపరెపలు కనిపించాయి. 
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 7వ రోజుకు చేరింది. మునుగోడు నియోజకవర్గం తాళ్ల సింగారం నుంచి ఆయన ఇవాళ యాత్ర ప్రారంభించారు. దేశం మొత్తం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు జరుపుకొంటున్న నేపథ్యంలో ఆయన తన యాత్రలో జాతీయ జెండాలు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. బండి సంజయ్‌తోపాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా జాతీయ జెండాలతో పాదయాత్రలో పాల్గొనడంతో దారి మొత్తం త్రివర్ణ పతాక రెపరెపలు కనిపించాయి.
22/22

మరిన్ని