News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (29-09-2022)

Updated : 29 Sep 2022 22:20 IST
1/40
విజయవాడలో ప్రారంభించిన ‘హైలైఫ్‌ బ్రైడ్స్‌’ ఎగ్జిబిషన్‌లో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు, నటి శ్రీలేఖ, మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. విజయవాడలో ప్రారంభించిన ‘హైలైఫ్‌ బ్రైడ్స్‌’ ఎగ్జిబిషన్‌లో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు, నటి శ్రీలేఖ, మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
2/40
3/40
4/40
అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం దాటితోట నుంచి గుగూడు వెళ్లే దారిలో కొండలు, గుట్టలు అధికంగా ఉంటాయి. దీంతో ఇక్కడ కొండవాలుగా భూములున్న రైతులు పంటల రక్షణ కోసం రాళ్లను గోడలా నిర్మించి పంటకు రక్షణ కల్పిస్తున్నారు. కొన్నిచోట్ల అడవి జంతువుల నుంచి రక్షణగా ఇవి పనికొస్తున్నాయి. ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఇళ్ల ముందు గోడలను సైతం ఇలా రాళ్లతో పేర్చుతున్నారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం దాటితోట నుంచి గుగూడు వెళ్లే దారిలో కొండలు, గుట్టలు అధికంగా ఉంటాయి. దీంతో ఇక్కడ కొండవాలుగా భూములున్న రైతులు పంటల రక్షణ కోసం రాళ్లను గోడలా నిర్మించి పంటకు రక్షణ కల్పిస్తున్నారు. కొన్నిచోట్ల అడవి జంతువుల నుంచి రక్షణగా ఇవి పనికొస్తున్నాయి. ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఇళ్ల ముందు గోడలను సైతం ఇలా రాళ్లతో పేర్చుతున్నారు.
5/40
6/40
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో మూడో రోజైన గురువారం సాయంత్రం స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో మూడో రోజైన గురువారం సాయంత్రం స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.
7/40
8/40
9/40
స్వర్ణదేవాలయాన్ని దర్శించుకునేందుకు సినీ నటుడు అల్లు అర్జున్‌ కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌ వెళ్లారు. ఈసందర్భంగా ఆయన అక్కడి బీఎస్‌ఎఫ్‌ సైనికులను కలిసి మాట్లాడారు. అల్లు అర్జున్‌ తమను కలవడంతో సోల్జర్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్వర్ణదేవాలయాన్ని దర్శించుకునేందుకు సినీ నటుడు అల్లు అర్జున్‌ కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌ వెళ్లారు. ఈసందర్భంగా ఆయన అక్కడి బీఎస్‌ఎఫ్‌ సైనికులను కలిసి మాట్లాడారు. అల్లు అర్జున్‌ తమను కలవడంతో సోల్జర్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
10/40
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్‌ స్వయంగా పాడి స్వరాలు సమకూర్చిన తొలి హిందీ మ్యూజిక్‌ వీడియో ‘ఓ పరీ’ అక్టోబర్‌ 4న విడుదల కానుంది. ఈ పాట విడుదల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు డీఎస్పీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్‌ స్వయంగా పాడి స్వరాలు సమకూర్చిన తొలి హిందీ మ్యూజిక్‌ వీడియో ‘ఓ పరీ’ అక్టోబర్‌ 4న విడుదల కానుంది. ఈ పాట విడుదల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు డీఎస్పీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు పెట్టారు.
11/40
36వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన డ్రోన్‌షో చూపరులను ఆకట్టుకుంది. 36వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన డ్రోన్‌షో చూపరులను ఆకట్టుకుంది.
12/40
13/40
14/40
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి పమన్‌జొమ్‌లో ఉత్తర, దక్షిణ కొరియాలను వేరు చేస్తున్న డీమిలిటరైజ్డ్‌ జోన్‌ను పరిశీలించారు. అనంతరం సైనిక కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి పమన్‌జొమ్‌లో ఉత్తర, దక్షిణ కొరియాలను వేరు చేస్తున్న డీమిలిటరైజ్డ్‌ జోన్‌ను పరిశీలించారు. అనంతరం సైనిక కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడారు.
15/40
16/40
ప్రముఖ సినీనటుడు రానా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రముఖ సినీనటుడు రానా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
17/40
18/40
గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘స్వాతిముత్యం’. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో అక్టోబర్‌2 సాయంత్రం 6గంటలకు నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘స్వాతిముత్యం’ దసరా కానుకగా అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది. గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘స్వాతిముత్యం’. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో అక్టోబర్‌2 సాయంత్రం 6గంటలకు నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘స్వాతిముత్యం’ దసరా కానుకగా అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.
19/40
గుజరాత్‌లో నేడు 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రీడాకారులంతా ఒక్కచోట మెరిశారు. పై ఫొటోలో పీవీ సింధు, నీరజ్‌ చోప్రా, అంజు బాబీ జార్జ్‌, మీరాబాయ్‌ చాను, గగన్‌నారంగ్‌లను చూడవచ్చు. గుజరాత్‌లో నేడు 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రీడాకారులంతా ఒక్కచోట మెరిశారు. పై ఫొటోలో పీవీ సింధు, నీరజ్‌ చోప్రా, అంజు బాబీ జార్జ్‌, మీరాబాయ్‌ చాను, గగన్‌నారంగ్‌లను చూడవచ్చు.
20/40
రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టైగర్‌ నాగేశ్వర్‌రావు’. ఈ సినిమాలో రేణు దేశాయ్‌ ‘హేమలత లవణం’ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టైగర్‌ నాగేశ్వర్‌రావు’. ఈ సినిమాలో రేణు దేశాయ్‌ ‘హేమలత లవణం’ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది.
21/40
అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం 4.05గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘ది ఘోస్ట్‌’ దసరా కానుకగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం 4.05గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘ది ఘోస్ట్‌’ దసరా కానుకగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది.
22/40
ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆది పురుష్‌’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ పోస్టర్‌ను శుక్రవారం ఉదయం 7.11గంటలకు, టీజర్‌ను అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆది పురుష్‌’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ పోస్టర్‌ను శుక్రవారం ఉదయం 7.11గంటలకు, టీజర్‌ను అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
23/40
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరై సందడి చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరై సందడి చేశారు.
24/40
25/40
ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహారెడ్డి జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకొని ప్రార్థనలు చేశారు. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహారెడ్డి జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకొని ప్రార్థనలు చేశారు.
26/40
27/40
28/40
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరదనీరు నిలిచిపోయింది. రాకపోకలకు వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. నాలాలు పొంగడంతో కొన్ని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరదనీరు నిలిచిపోయింది. రాకపోకలకు వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. నాలాలు పొంగడంతో కొన్ని ఇళ్లలోకి నీళ్లు చేరాయి.
29/40
30/40
31/40
32/40
ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు మాతృమూర్తి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి మహేశ్‌ నివాసానికి వెళ్లారు. ఆయనను, కృష్ణను పరామర్శించారు. ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు మాతృమూర్తి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి మహేశ్‌ నివాసానికి వెళ్లారు. ఆయనను, కృష్ణను పరామర్శించారు.
33/40
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు సైతం అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారనేది ప్రతీతి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు సైతం అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారనేది ప్రతీతి.
34/40
35/40
36/40
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కొంపల్లిలో మల్లారెడ్డి, నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో సైక్లథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఔత్సాహికులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. అనంతరం సైకిల్ పోటీలు ప్రారంభించి తానూ పాల్గొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కొంపల్లిలో మల్లారెడ్డి, నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో సైక్లథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఔత్సాహికులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. అనంతరం సైకిల్ పోటీలు ప్రారంభించి తానూ పాల్గొన్నారు.
37/40
38/40
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సింహ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో స్వామివారు యోగ నరసింహుడి అవతారంలో సింహవాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 	తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సింహ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో స్వామివారు యోగ నరసింహుడి అవతారంలో సింహవాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
39/40
40/40
నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఓ ఆస్పత్రి నిర్వాహకులు బెలూన్‌తో వినూత్నంగా ఈ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ వద్ద కనిపించింది ఈ దృశ్యం.	నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఓ ఆస్పత్రి నిర్వాహకులు బెలూన్‌తో వినూత్నంగా ఈ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ వద్ద కనిపించింది ఈ దృశ్యం.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని