News In Pics : చిత్రం చెప్పే సంగతులు -2 (22-11-2022)

Updated : 22 Nov 2022 19:56 IST
1/15
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహించారు. ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌, వైస్‌ ఛాన్సలర్‌ సంజీవి, వివిధ శాఖల ఆచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహించారు. ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌, వైస్‌ ఛాన్సలర్‌ సంజీవి, వివిధ శాఖల ఆచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
2/15
అకాల వర్షాలు అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ముమ్మరంగా వరికోతలు సాగుతుండగానే.. జల్లులు పడుతుండటంతో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పెదవేగి మండలం భోగాపురంలో ధాన్యపు రాశులపైకి చేరుతున్న నీటిని తొలగిస్తున్న రైతు సాల్మన్‌రాజు కష్టాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. అకాల వర్షాలు అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ముమ్మరంగా వరికోతలు సాగుతుండగానే.. జల్లులు పడుతుండటంతో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పెదవేగి మండలం భోగాపురంలో ధాన్యపు రాశులపైకి చేరుతున్న నీటిని తొలగిస్తున్న రైతు సాల్మన్‌రాజు కష్టాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.
3/15
తమ కూతురి వివాహ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా తెదేపా అధినేత చంద్రబాబు దంపతులను ఆహ్వానిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని దంపతులు తమ కూతురి వివాహ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా తెదేపా అధినేత చంద్రబాబు దంపతులను ఆహ్వానిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని దంపతులు
4/15
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ, బాలాజీ నగర్‌ ప్రాంతాల్లోని వృక్షాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేశారు. ప్రజాధనంతో ఇలా చెట్లకు రంగులు వేయడం ఏంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ, బాలాజీ నగర్‌ ప్రాంతాల్లోని వృక్షాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేశారు. ప్రజాధనంతో ఇలా చెట్లకు రంగులు వేయడం ఏంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
5/15
డిసెంబర్‌ 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకలకు విశాఖ సాగరతీరం ముస్తాబవుతోంది. యుద్ధనౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు ప్రదర్శించే ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డిసెంబర్‌ 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకలకు విశాఖ సాగరతీరం ముస్తాబవుతోంది. యుద్ధనౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు ప్రదర్శించే ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
6/15
తిరుమలలో ఇవాళ మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. మంచు పడుతున్న రీతిలో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో భక్తులు ఆలయం వద్ద ఫొటోలు తీసుకుంటూ మురిసిపోయారు. తిరుమలలో ఇవాళ మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. మంచు పడుతున్న రీతిలో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో భక్తులు ఆలయం వద్ద ఫొటోలు తీసుకుంటూ మురిసిపోయారు.
7/15
గతేడాది క్వింటా రూ.12వేలు దాటిన పత్తి ధర ఈ సారి రూ.8వేలకు మించడం లేదు. దీంతో పెట్టుబడి ఖర్చులు పోనూ మిగిలేది ఏమీ ఉండదని గ్రహించిన రైతులు తమ ఇళ్లలో, అద్దె ఇళ్లలో పత్తి నిల్వ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన రైతు నరేశ్‌ ఇలా తన ఇంట్లోనే పత్తి నిల్వ చేసుకున్నాడు. రూ.10వేలకు పైన ధర వస్తేనే విక్రయిస్తానని ఆయన చెబుతున్నారు. గతేడాది క్వింటా రూ.12వేలు దాటిన పత్తి ధర ఈ సారి రూ.8వేలకు మించడం లేదు. దీంతో పెట్టుబడి ఖర్చులు పోనూ మిగిలేది ఏమీ ఉండదని గ్రహించిన రైతులు తమ ఇళ్లలో, అద్దె ఇళ్లలో పత్తి నిల్వ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన రైతు నరేశ్‌ ఇలా తన ఇంట్లోనే పత్తి నిల్వ చేసుకున్నాడు. రూ.10వేలకు పైన ధర వస్తేనే విక్రయిస్తానని ఆయన చెబుతున్నారు.
8/15
నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజీస్‌’. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నన్నయ్య రాసిన..’ అంటూ సాగే లిరికల్ గీతాన్ని తాజాగా విడుదల చేశారు. ఆ విషయాన్ని వెల్లడిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.	నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజీస్‌’. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నన్నయ్య రాసిన..’ అంటూ సాగే లిరికల్ గీతాన్ని తాజాగా విడుదల చేశారు. ఆ విషయాన్ని వెల్లడిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
9/15
మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలోని ‘బాస్‌ పార్టీ’ పాటను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ పాట కోసం కళా దర్శకుడు ఎ.ఎస్‌ ప్రకాశ్‌ అద్భుతమైన సెట్‌ వేశారని ప్రశంసిస్తూ చిరు అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలోని ‘బాస్‌ పార్టీ’ పాటను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ పాట కోసం కళా దర్శకుడు ఎ.ఎస్‌ ప్రకాశ్‌ అద్భుతమైన సెట్‌ వేశారని ప్రశంసిస్తూ చిరు అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.
10/15
వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సాగుతోంది. చిట్యాల మండలం దూతపల్లి వద్ద ఆమె కల్లుగీత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్లు గీసే మోకు ధరించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సాగుతోంది. చిట్యాల మండలం దూతపల్లి వద్ద ఆమె కల్లుగీత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్లు గీసే మోకు ధరించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
11/15
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన నేటి ఉదయం ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.  తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన నేటి ఉదయం ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
12/15
నార్త్ కరోలినాలోని మెరైన్‌ కార్ప్స్‌ ఎయిర్‌ స్టేషన్‌ చెర్రీ పాయింట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మిలటరీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ ఇలా సెల్ఫీ తీసుకున్నారు.	నార్త్ కరోలినాలోని మెరైన్‌ కార్ప్స్‌ ఎయిర్‌ స్టేషన్‌ చెర్రీ పాయింట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మిలటరీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ ఇలా సెల్ఫీ తీసుకున్నారు.
13/15
ఇండోనేసియా దేశం పశ్చిమ జావాలోని చియాంజుర్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలిపోయిన తన ఇంట్లోని వస్తువుల కోసం ఓ వ్యక్తి ఇలా శోధిస్తూ కనిపించాడు.	ఇండోనేసియా దేశం పశ్చిమ జావాలోని చియాంజుర్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలిపోయిన తన ఇంట్లోని వస్తువుల కోసం ఓ వ్యక్తి ఇలా శోధిస్తూ కనిపించాడు.
14/15
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రద్దీగా ఉండే చాదర్‌ఘాట్‌-కోఠి ఉమెన్స్‌ కళాశాల రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు మొరాయించి నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది, మరికొందరు బస్సును పక్కకి నెట్టడంతో మిగిలిన వాహనాలు ముందుకు కదిలాయి.	హైదరాబాద్‌ నగరంలో నిత్యం రద్దీగా ఉండే చాదర్‌ఘాట్‌-కోఠి ఉమెన్స్‌ కళాశాల రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు మొరాయించి నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది, మరికొందరు బస్సును పక్కకి నెట్టడంతో మిగిలిన వాహనాలు ముందుకు కదిలాయి.
15/15
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఓ బ్రాండ్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఆయన లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అభిమానులు ఫిదా అవుతున్నారు.	యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఓ బ్రాండ్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఆయన లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అభిమానులు ఫిదా అవుతున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts