News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (30-05-2023)

Updated : 30 May 2023 21:47 IST
1/21
ముంబయిలో జూన్‌ 7న శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత గౌతమ్‌ సింఘానియాను తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ముంబయిలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ముంబయిలో జూన్‌ 7న శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత గౌతమ్‌ సింఘానియాను తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ముంబయిలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు.
2/21
కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ మండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, నాయకులు ‘కాఫీ టేబుల్‌ విత్ తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ మండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, నాయకులు ‘కాఫీ టేబుల్‌ విత్ తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
3/21
క్రికెటర్‌ యజువేంద్ర చాహల్‌ తన తాజా ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నాడు. ‘నా కొత్త లుక్‌ అదుర్స్‌. దీనికి మీరేం చెబుతారు’ అని ట్వీట్‌ చేశాడు. క్రికెటర్‌ యజువేంద్ర చాహల్‌ తన తాజా ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నాడు. ‘నా కొత్త లుక్‌ అదుర్స్‌. దీనికి మీరేం చెబుతారు’ అని ట్వీట్‌ చేశాడు.
4/21
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ అదరగొట్టాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌, ఇతర కప్‌లను సొంతం చేసుకున్నాడు. వీటికి సంబంధిన ఫొటోను గిల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. ‘ఇవి నా జ్ఞాపకాలు’ అని ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ అదరగొట్టాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌, ఇతర కప్‌లను సొంతం చేసుకున్నాడు. వీటికి సంబంధిన ఫొటోను గిల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. ‘ఇవి నా జ్ఞాపకాలు’ అని ట్వీట్‌ చేశాడు.
5/21
నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర  వైఎస్‌ఆర్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్‌.. నాయకులు, కార్యకర్తలతో సెల్ఫీలు తీసుకొని ఉత్సాహపరిచారు. నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్‌ఆర్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్‌.. నాయకులు, కార్యకర్తలతో సెల్ఫీలు తీసుకొని ఉత్సాహపరిచారు.
6/21
సినీ నిర్మాత డి. సురేశ్‌బాబు కుమారుడు అభిరామ్‌ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’. జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో భాగంగా వెంకటేశ్‌, అభిరామ్ చిత్ర విశేషాలు పంచుకున్నారు. సినీ నిర్మాత డి. సురేశ్‌బాబు కుమారుడు అభిరామ్‌ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’. జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో భాగంగా వెంకటేశ్‌, అభిరామ్ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
7/21
జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
8/21
బీజింగ్‌లో కొత్తగా నిర్మించిన సబ్‌వే స్టేషన్‌కు సమీపంలో ఓ ఆర్ట్‌ వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్ట్‌ వర్క్‌ సందర్శకులు, చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బీజింగ్‌లో కొత్తగా నిర్మించిన సబ్‌వే స్టేషన్‌కు సమీపంలో ఓ ఆర్ట్‌ వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్ట్‌ వర్క్‌ సందర్శకులు, చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
9/21
బహదూర్‌పల్లి అటవీ ప్రాంతంలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనంపై ఓ మయూరం ఇలా కనువిందు చేసింది. బహదూర్‌పల్లి అటవీ ప్రాంతంలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనంపై ఓ మయూరం ఇలా కనువిందు చేసింది.
10/21
హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ట్విటర్‌ వేదికగా అల్లు శిరీష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు  శిరీష్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ ‘బడ్డీ’’ అని ట్వీట్‌ చేశారు. హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ట్విటర్‌ వేదికగా అల్లు శిరీష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శిరీష్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ ‘బడ్డీ’’ అని ట్వీట్‌ చేశారు.
11/21
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కప్‌ 2023 తెలంగాణ క్రీడా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ను క్రీడాబృందం సన్మానించింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కప్‌ 2023 తెలంగాణ క్రీడా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ను క్రీడాబృందం సన్మానించింది.
12/21
హీరో శర్వానంద్‌ ప్రగతి భవన్‌లో ఎంపీ సంతోష్ కుమార్‌ను కలిసి తన వివాహానికి  ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని ఎంపీకి అందించారు. హీరో శర్వానంద్‌ ప్రగతి భవన్‌లో ఎంపీ సంతోష్ కుమార్‌ను కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని ఎంపీకి అందించారు.
13/21
కాంబోడియా రాజు నోరోదోమ్‌ సిహమోని భారత రాష్ట్రపతి భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంబోడియా రాజు నోరోదోమ్‌ సిహమోని భారత రాష్ట్రపతి భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
14/21
నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌లో భారాస ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  మంత్రి మల్లారెడ్డి, కవిత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌లో భారాస ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి, కవిత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.
15/21
తెలంగాణ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన నూతన నిర్మాణాలను మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ  సందర్భంగా అక్కడి నంది జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన కళాకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన నూతన నిర్మాణాలను మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి నంది జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన కళాకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
16/21
విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవనాన్ని సీఎం జగన్‌ దంపతులు సందర్శించారు. అనంతరం అక్కడ నూతనంగా నిర్మించిన ఓ భవనాన్ని సీఎం ప్రారంభించారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవనాన్ని సీఎం జగన్‌ దంపతులు సందర్శించారు. అనంతరం అక్కడ నూతనంగా నిర్మించిన ఓ భవనాన్ని సీఎం ప్రారంభించారు.
17/21
ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో చెన్నైకి  విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ అనంతరం ధోనీ, జడేజా తన కుటుంబసభ్యులు ట్రోఫీతో ఇలా ఫొటోలకు పోజిచ్చి సంబరాలు చేసుకున్నారు.  ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో చెన్నైకి విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ అనంతరం ధోనీ, జడేజా తన కుటుంబసభ్యులు ట్రోఫీతో ఇలా ఫొటోలకు పోజిచ్చి సంబరాలు చేసుకున్నారు.
18/21
పక్షులను బందించకుండా స్వేచ్ఛగా ఎగరనివ్వాలనే ఉద్దేశంతో పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్ ఆఫ్‌ యానిమల్స్‌(పెటా) ఇండియా మద్దతుదారులు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌ వద్ద ఇలా అవగాహన ప్రదర్శన చేపట్టారు. పక్షులను బందించకుండా స్వేచ్ఛగా ఎగరనివ్వాలనే ఉద్దేశంతో పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్ ఆఫ్‌ యానిమల్స్‌(పెటా) ఇండియా మద్దతుదారులు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌ వద్ద ఇలా అవగాహన ప్రదర్శన చేపట్టారు.
19/21
తెలంగాణలోని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు సమర్పించిన నగదు కానుకలను మంగళవారం ఉదయం నుంచి లెక్కించారు. తెలంగాణలోని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు సమర్పించిన నగదు కానుకలను మంగళవారం ఉదయం నుంచి లెక్కించారు.
20/21
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, నాయకులు రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, నాయకులు రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
21/21
అమరావతి ప్రాంతంలో రాత్రి వేళలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. మందడంలో రోడ్డుపై వాహన రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు గెలవాలి.. అమరావతి నిలవాలి, పాలన చేతగాని సీఎం రాజీనామా చేయాలి అంటూ రైతులు నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. అమరావతి ప్రాంతంలో రాత్రి వేళలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. మందడంలో రోడ్డుపై వాహన రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు గెలవాలి.. అమరావతి నిలవాలి, పాలన చేతగాని సీఎం రాజీనామా చేయాలి అంటూ రైతులు నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు.
Tags :

మరిన్ని