
తాజా వార్తలు
విరాట్ కోహ్లీ నయా రికార్డు
వన్డేల్లో మరో అరుదైన ఘనత
ఇంటర్నెట్ డెస్క్ : ప్రపంచ క్రికెట్లో మేటి బ్యాట్స్‌మెన్‌గా విమర్శకుల ప్రశంసలు పొందుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఘనత సాధించాడు. సచిన్ వారసుడిగా జట్టులోకి వచ్చిన కోహ్లీ తన డాషింగ్ ప్రదర్శనతో కొద్దికాలంలోనే సారథిగా బాధ్యతలు చేపట్టాడు. క్రికెట్ సమాజంలో ఈ ‘పరుగుల యంత్రం’ రికార్డులు నెలకొల్పడం కొత్తేమీ కాదు.
సచిన్‌కు 300.. కోహ్లీకి 242
విరాట్ కోహ్లీ ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడని తన పరుగుల రికార్డులను చూస్తే అర్థం అవుతుంది. తన కెరీర్లో 251 మ్యాచులాడిన కోహ్లీ 242వ ఇన్నింగ్స్‌లో 12 వేల మైలురాయిని అందుకున్నాడు. కాగా, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ 12 వేల పరుగులను చేయడానికి 309 మ్యాచులాడి 300 ఇన్సింగ్స్ తీసుకున్నాడు.
462 ఇన్నింగ్స్‌లో 22 వేల పరుగులు
క్రికెట్లో పరుగుల రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తున్న విరాట్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో 22 వేల పరుగులను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి కోహ్లీ కేవలం 462 ఇన్సింగ్స్ తీసుకున్నాడు. అయితే క్రికెట్ దిగ్గజాలైన సచిన్ 493, బ్రియన్ లారా 511, రికీ పాంటింగ్ 514 ఇన్సింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు.
వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు..
1. విరాట్ కోహ్లీ(242 ఇన్నింగ్స్)
2. సచిన్ తెందూల్కర్(300)
3. రికీ పాంటింగ్(314)
4. కుమార సంగక్కర(336)
5. సనత్ జయసూర్య(379)
6. మహేల జయవర్దనే(399)
* వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో టీంఇండియా ఆటగాళ్లు ఇద్దరు ఉండగా, ఆస్ర్టేలియా నుంచి రికీ పాంటింగ్, శ్రీలంక నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉండటం గమనార్హం.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
