60 శాతానికి చేరువగా హాజరు

ప్రధానాంశాలు

60 శాతానికి చేరువగా హాజరు

సర్కారు బడుల్లో రోజురోజుకూ వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు పునఃప్రారంభమై 15 రోజులు గడవగా సర్కారు బడుల్లో హాజరు శాతం 60 శాతానికి చేరుకుంటోంది. గురువారం ప్రభుత్వ పాఠశాలల సగటు హాజరు శాతం 58 శాతానికి వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లాలో 70.66 శాతం నమోదైంది. ప్రైవేట్‌ పాఠశాలల హాజరు శాతం 32.29 వద్దే ఉంది. అన్నిరకాల పాఠశాలల్లో సగటున 42.21 శాతం విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు వస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో కొద్దికాలంపాటు ఆన్‌లైన్‌ పాఠాలకు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కొన్ని పాఠశాలలు డిసెంబరు వరకు ఆన్‌లైన్‌ తరగతులను నడుపుతామని ఇప్పటికే స్పష్టం చేశాయి. కొన్ని పాఠశాలలు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించినా తక్కువమంది రావడంతో వారిని కూడా ఆన్‌లైన్‌ విధానంలో పాఠాలు వినాలని సూచించాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని