close
ఆసుపత్రి ట్యాంకులో ‘హాలాహలం’

రాష్ట్రంలోనే పేరెన్నిక గల హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ ఆసుపత్రి పాత భవనంపై ఉన్న నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ట్యాంకుకు ఏర్పాటు చేసిన మూత చిల్లులతో దర్శనమిస్తోంది. దీనికి తోడు దాన్ని శుభ్రం చేయకపోవడంతో అడుగు భాగంలో పాచి పట్టింది. దీన్ని 2018 అక్టోబరు 16న శుభ్రం చేశారు. ఈ ట్యాంకులోని నీరు ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులకు, స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కళాశాల వసతి గృహానికి సరఫరా అవుతుంది. ఈ పరిస్థితిని చూస్తే ఇక్కడ రోగం నయం కావడం దేవుడెరుగు.. కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

-ఈనాడు, హైదరాబాద్‌

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.