ఆనందం కాదా?

ఒక ధనవంతుడు జెన్‌ గురువు దగ్గరికి వెళ్లాడు. ‘స్వామీ! మా కుటుంబ కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించేలా, మమ్మల్ని ఆశీర్వదిస్తూ

Updated : 03 Jun 2021 05:59 IST

జెన్‌ కథ

క ధనవంతుడు జెన్‌ గురువు దగ్గరికి వెళ్లాడు. ‘స్వామీ! మా కుటుంబ కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించేలా, మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఏదన్నా రాసివ్వండి. దాన్ని చూసి మా ఇంటిల్లిపాదీ, తర్వాతి తరాలు ఆనందించాలి’ అన్నాడు. వెంటనే ఆ జెన్‌ గురువు ఒక కాగితం తీసుకుని ‘తండ్రి చనిపోతాడు. కొడుకు చనిపోతాడు. మనవడు చనిపోతాడు’ అని రాశాడు. దాన్ని చూసి ఆ ధనవంతుడికి కోపం తన్నుకొచ్చింది. ‘ఏంటి స్వామీ! నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మా కుటుంబం ఆనందించేలా ఏదన్నా రాయమంటే అమంగళంలా చావుల గురించి రాస్తారా? మీకిది సబబా?’ అని అడిగాడు. జెన్‌ గురువు ప్రశాంతంగా నవ్వుతూ ‘నేను రాసిన దాంట్లో తప్పేముంది? ఒకవేళ నీ కొడుకు నీకన్నా ముందే చనిపోయాడనుకో! మీ కుటుంబంలో ఎంత క్షోభ నిండుతుంది. నీ మనవడు నీ కొడుకుకన్నా ముందే మరణించాడనుకో! అదెంత ఆవేదన. ఒక తరం తర్వాత మరో తరం అలా సాగిపోతూండటమే జీవితం. అదే ఏ కుటుంబానికైనా, వంశానికైనా నిజమైన ఆనందం. కాదంటావా?’ ప్రశ్నించాడు గురువు. ఆ ధనవంతుడి నోట మాట లేదు

- శాలిని గుడిపాటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని