దైవానికే ప్రాధాన్యత

జీవితంలో అన్నిటికంటే దేవుడికే ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు శ్రేష్ఠమైన జీవితాన్ని ప్రసాదించి, అడగకుండానే అక్కరలన్నీ తీర్చి ముదిమి వరకూ తోడుండి, మరణానంతరమూ వెంటుండే దైవాన్నే సర్వంగా భావించాలి.

Published : 03 Nov 2022 00:11 IST

జీవితంలో అన్నిటికంటే దేవుడికే ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు శ్రేష్ఠమైన జీవితాన్ని ప్రసాదించి, అడగకుండానే అక్కరలన్నీ తీర్చి ముదిమి వరకూ తోడుండి, మరణానంతరమూ వెంటుండే దైవాన్నే సర్వంగా భావించాలి. కానీ ఈ వాస్తవాన్ని మర్చిపోయి లోక భ్రమలోపడి ఇదే శాశ్వతమనుకుంటారు. అనవసర విషయాలతో, అలవికాని ఆశలతో ఉక్కిరిబిక్కిరై నిరాశానిస్పృహలతో కాలం వెళ్ల బుచ్చుతారు. దేవుడికి ప్రధమ స్థానం ఇచ్చినప్పుడు మనల్ని క్షేమ మార్గంలో నడిపిస్తాడు. శ్రేష్ఠమైన ఈవులను (వరాలు, కానుకలు) అనుగ్రహిస్తాడు. నమ్మినవారిని తండ్రిలా ఆదుకుంటాడు. అబ్రాహాం వృద్ధుడైన తరుణంలో  ఇస్సాకును కుమారుడిగా అనుగ్రహించాడు. లేకలేక పుట్టిన కుమారుణ్ణి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నప్పుడు అతణ్ణి బలి ఇవ్వమన్నాడు. అందుకు సిద్ధమై దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో నెగ్గడమే కాకుండా తన జీవితంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత వుందో అబ్రాహాం నిరూపించాడు. అందుకే దేవుడు అతణ్ణి ఆశీర్వదించాడు. అతని సంతానాన్ని తరతరాలకు విస్తరింపచేశాడు.

- బందెల స్టెర్జి రాజన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని