Published : 19 Jan 2023 00:15 IST

పిల్లల్ని రానీయండి

పిల్లలన్నాక అల్లరి చేయడం సహజం. ఆ చేష్టలను ఆస్వాదించి ఆనందించడం ఓ కళ. ఎవరైనా వారితో విసిగిపోతున్నామంటే, వాళ్లు దేవుణ్ణి దూరం చేసుకున్నట్టే అన్నాడు ఏసు. ప్రభువు చెప్పే సందేశాలు వినాలని జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. పిల్లలకూ ప్రభువును చూడాలని ఉండేది. కానీ వాళ్లను లోనికి రానీయకుండా కసిరి తరిమేసే వారు. ఒకసారలాగే చిన్నారుల్ని తరమడం చూసిన ప్రభువు ‘అంతా నాదే, అందరూ నావారే అని మీకు తెలియదా? పిల్లల్ని ఎందుకు లోనికి రానివ్వడంలేదు? వాళ్లను నా దగ్గరికి పంపండి! పరలోక రాజ్యం బాలల సొత్తు. మీరు కూడా పసి పిల్లల మనస్తత్వంతో కపటం లేకుండా ఉండండి. లేదంటే పరలోకం చేరలేరు’ అంటూ హెచ్చరించాడు. లోనికి వచ్చిన పిల్లల్ని ఒడిలోకి తీసుకుని, ప్రేమగా ఆశీర్వదించాడు. వాళ్లు ఆయన చుట్టూ చేరి ముచ్చట్లాడుతుంటే పచ్చటి చెట్టుకు విరిసిన పువ్వుల్లా అనిపించేది. పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఆదరించడమంటే అది తనను ఆహ్వానించడమే అనేవాడు ఏసు.

డాక్టర్‌ దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు