ప్రవక్త ఆజ్ఞతో..

‘అయ్యా! నాలో నాలుగు దుర్గుణాలున్నాయి. వ్యభిచరిస్తాను. దొంగతనాలు చేస్తాను. మద్యం తాగుతాను. అబద్ధాలు చెబుతాను. తమరి ఆజ్ఞ ఉంటే వీటిలో ఒకదాన్నయినా వదిలేయగలను’ అన్నాడో వ్యక్తి దైవప్రవక్తతో

Published : 02 Mar 2023 00:22 IST

‘అయ్యా! నాలో నాలుగు దుర్గుణాలున్నాయి. వ్యభిచరిస్తాను. దొంగతనాలు చేస్తాను. మద్యం తాగుతాను. అబద్ధాలు చెబుతాను. తమరి ఆజ్ఞ ఉంటే వీటిలో ఒకదాన్నయినా వదిలేయగలను’ అన్నాడో వ్యక్తి దైవప్రవక్తతో. దానికాయన(స) ‘అబద్ధం చెప్పటం మానుకో’ అన్నారు. అతడు సరేనని ‘ఈ క్షణం నుంచీ అబద్ధం చెప్పను’ అని ప్రమాణం చేశాడు. సాయంత్రమవగానే మనసు సారాయివైపు లాగింది. ముందు తాగి, తర్వాత వేశ్యవద్దకు వెళ్లాలనుకున్నాడు. కానీ మర్నాడు ప్రవక్త అడిగితే ఏం చెప్పాలి? నిజం చెబితే రెండు తప్పులకు శిక్ష పడుతుంది. అబద్ధం చెబితే ప్రమాణభంగమౌతుంది- అని ఆలోచిస్తూ గడిపాడు. అర్ధరాత్రి దొంగతనానికి బయల్దేరబోయాడు. కానీ ప్రవక్త నిలదీస్తే ఏం చెప్పాలి? చౌర్యం చేసినట్లు తెలిస్తే చేతులు ఖండిస్తారు. లేదని చెబితే వాగ్దానభంగమౌతుంది. అలా మూడు పనుల నుంచి తనను కట్టిపడేసుకున్నాడు. తెల్లవారగానే ప్రవక్త (స) వద్దకు వెళ్లి ‘ప్రభూ! అబద్ధం చెప్పకూడదన్న దృఢ సంకల్పం మూలంగా నాలుగు దుర్గుణాలూ దూరమయ్యాయి’ అన్నాడు. ప్రవక్త సంతృప్తిగా చూశారు.
ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు