Bank Jobs: గుడ్‌న్యూస్‌.. గ్రామీణ బ్యాంకుల్లో 8,600+ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

IBPS RRB 2023 Notification: 2023కు సంబంధించిన ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 8,000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి.

Updated : 01 Jun 2023 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే నియామక పరీక్షకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (CRP)ల ద్వారా మొత్తం 8,612 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆయా పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 1 నుంచి 21వరకు https://www.ibps.in/  వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాలివే..

ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో క్లర్కు పోస్టులు 5,538 ఉండగా.. ఆఫీసర్‌ స్కేల్‌ I పోస్టులు 2,485, ఆఫీసర్‌ స్కేల్‌ II జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ 332, ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) 68, ఆఫీసర్‌ 2 (సీఏ) 21, ఆఫీసర్‌ స్కేల్‌ 2 (లా ఆఫీసర్‌ 24, ట్రజరీ ఆఫీసర్‌ స్కేల్‌- 2 పోస్టులు 8, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ మూడు, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ స్కేల్‌ -2 పోస్టులు 60, ఆఫీసర్‌ స్కేల్‌ -3 పోస్టులు 73 చొప్పున ఉన్నాయి.

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ షెడ్యూల్‌...

  • దరఖాస్తుల స్వీకరణ: జూన్‌ 1 నుంచి జూన్‌ 21 వరకు
  • ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌(PET): జులై 17 నుంచి 22వరకు
  • ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(PET) కాల్‌ లెటర్ల డౌన్‌లోడ్‌: జులై 10
  • ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్ష: ఆగస్టులో జరిగే అవకాశం
  • ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు, మెయిన్స్‌ పరీక్ష సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
  • మెయిన్స్‌ ఫలితాలు అక్టోబర్‌లో ప్రకటించి.. అక్టోబర్‌/నవంబర్‌ మాసాల్లో ఇంటర్వూలు నిర్వహిస్తారు. 
  • ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: జనవరి, 2024
  • దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ ₹175; ఇతరులు ₹850
  • ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్కు, పీవో (అసిస్టెంట్‌ మేనేజర్‌) విద్యార్హత గ్రాడ్యుయేషన్‌ ఉంటే చాలు. ఎలాంటి అనుభవం అవసరంలేదు.
  • ఆఫీసర్‌ స్కేల్‌- 2 జనరల్‌ బ్యాంకింగ్ ఆఫీసర్‌ (మేనేజర్‌) పోస్టులకు గ్రాడ్యుయేషన్‌లో 50శాతం మార్కులు ఉండాలి. ఏదైనా బ్యాంకు/ఫైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి. 
  • వేతనం: ఉద్యోగాల హోదాలను బట్టి నెలకు కనీస వేతనం రూ.15వేలు నుంచి గరిష్ఠంగా రూ.44వేలు వరకు ఉండొచ్చు.

పరీక్ష విధానం, వయో పరిమితి, దరఖాస్తు చేసుకొనే విధానం, ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, పరీక్ష కేంద్రాలు, తదితర పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

పూర్తి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని