CUET UG 2024: సీయూఈటీ (యూజీ) దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు

సీయూఈటీ యూజీ పరీక్షకు దరఖాస్తుల గడువును ఏప్రిల్‌ 5 వరకూ పొడిగిస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

Published : 31 Mar 2024 15:56 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ (CUET UG 2024) పరీక్షకు దరఖాస్తుల గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 26తో దరఖాస్తుల గడువు ముగియగా.. ఇటీవల మార్చి 31 వరకు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి దరఖాస్తుల సమర్పణకు గడువు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏప్రిల్‌ 5వ తేదీ రాత్రి 9.50గంటల వరకు అభ్యర్థులు https://exams.nta.ac.in/CUET-UG/ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది. 

గమనించారా..? ఈ పరీక్షల తేదీలు మారాయ్‌!

ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్‌టీఏ తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో సీయూఈటీ యూజీ పరీక్షను హైబ్రిడ్‌ పద్ధతి (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహించాలని నిర్ణయించారు. జూన్‌ 30న ఫలితాలను విడుదల చేస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని