Published : 28 Jun 2022 01:09 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు


ఆర్మీ-ఏఎస్‌సీ సెంటర్లలో 458 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్‌సీ సెంటర్లు గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

మొత్తం పోస్టులు: 458  సెంటర్ల వారీగా ఖాళీలు: ఏఎస్‌సీ సెంటర్‌ (దక్షిణ)-209, ఏఎస్‌సీ సెంటర్‌ (ఉత్తర)-249. కుక్‌, సివిలియన్‌ కేటరింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్టేషన్‌ ఆఫీసర్లు, ఫైర్‌మెన్లు, ఫైర్‌ ఇంజిన్‌ డ్రైవర్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో అనుభవంతో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


యూపీఎస్సీ- 13 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)...వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 13. ఏరోనాటికల్‌ ఆఫీసర్లు-06, ప్రొఫెసర్‌-01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-05, ఇంజినీర్‌-01.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 14.

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


డిజిటల్‌ ఇండియాలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* యంగ్‌ ప్రొఫెషనల్స్‌

మొత్తం పోస్టులు: 17 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ/ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ డిప్లొమా/ ఎల్‌ఎల్‌బీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.60000 చెల్లిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://dic.gov.in/


ప్రవేశాలు
ఏయూలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సంయుక్తంగా 2022-2023 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నాయి.

కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పీజీ డిప్లొమా (క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ), పీజీ డిప్లొమా (ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ), పీజీ డిప్లొమా (గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ).

అర్హత: ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ కార్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్‌ ప్యాలెస్‌, పెదవాల్తేర్‌, విశాఖపట్నం చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: 2022, జులై 31.

వెబ్‌సైట్‌: http://audoa.in/


అప్రెంటిస్‌లు
ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో...

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 600  ట్రేడులు: కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్లు, మెషినిస్టులు, పెయింటర్లు, వెల్డర్లు, పాసా.

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 26.07.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 26.

వెబ్‌సైట్‌: https://icf.indianrailways.gov.in/


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని