ఆంగ్లంలో పీజీ చేశాక...

ఎంఏ ఇంగ్లిష్‌ చదువుదామనుకుంటున్నాను. పూర్తి చేసినవారికి ఉండే ఉద్యోగావకాశాలేంటి?

Published : 15 Mar 2021 00:12 IST

ఎంఏ ఇంగ్లిష్‌ చదువుదామనుకుంటున్నాను. పూర్తి చేసినవారికి ఉండే ఉద్యోగావకాశాలేంటి?  - బి. పూజిత
* ఎంఏ ఇంగ్లిష్‌ చదివిన తరువాత ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నవారికి ఇంగ్లిష్‌ బోధించే అధ్యాపకులుగా ఉద్యోగం పొందవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్‌లో కానీ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్లెట్‌లో కానీ ఉత్తీర్ణత సాధించి, డిగ్రీ చదువుతున్న వారికి ఆంగ్లం బోధించే అధ్యాపకులుగా ఉద్యోగం పొందవచ్చు. పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీలో అధ్యాపకులుగా చేరవచ్చు. ఎంఏ ఇంగ్లిష్‌ చదివాక బీఈడీ చేసి కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టవచ్చు. భాషపై పట్టు సాధించి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ సంస్థల్లో బోధకునిగా స్థ్టిరపడవచ్చు. ఆంగ్లంతో పాటు మరో భాషలో ప్రావీణ్యం సంపాదించి అనువాదకులుగా స్థిరపడవచ్చు. మీ భాషాజ్ఞానానికి సృజనాత్మకత తోడైతే వాణిజ్య ప్రకటనల రంగంలో కంటెంట్‌ రైటర్‌గా మంచి అవకాశాలుంటాయి. విదేశాల్లోనూ ఇంగ్లిష్‌ భాష బోధించడానికి చాలా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ప్రచురణ, పత్రికా రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. టెక్నికల్‌ రైటర్‌గా, కంటెంట్‌ రైటర్‌గా, స్టూడెంట్‌ కౌన్సిలర్‌గా కూడా విధులు నిర్వర్తించవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని