వస్తుందా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం?

ఎంసీఏ చదివి, కొన్ని కారణాల వల్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయలేకపోయాను. అలా ఏడేళ్ల గ్యాప్‌ వచ్చింది. ఈ సమయంలో చిన్నచిన్న ఉద్యోగాలు చేశాను.

Updated : 11 Oct 2021 06:20 IST

ఎంసీఏ చదివి, కొన్ని కారణాల వల్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయలేకపోయాను. అలా ఏడేళ్ల గ్యాప్‌ వచ్చింది. ఈ సమయంలో చిన్నచిన్న ఉద్యోగాలు చేశాను. మళ్లీ సాఫ్ట్‌వేర్‌ కొలువు వస్తుందా?

- పి. పూర్ణిమ

* ఎంసీఏ తరువాత వచ్చిన ఏడు సంవత్సరాల విరామం గురించి ఎక్కువగా ఆలోచించి నిరాశకు గురి అవ్వొద్దు. ఇటీవల సాఫ్ట్‌వేర్‌ రంగంలో వస్తున్న మార్పుల గురించి ఈ రంగంలో పనిచేస్తున్నవారితో మాట్లాడి అవగాహన పెంచుకోండి. ఆ మార్పులకు తగిన కొత్త సాఫ్ట్‌వేర్‌లూ, కొత్త కోర్సులూ నేర్చుకోండి. మీ భావప్రకటన సామర్ధ్యాల్ని మెరుగుపర్చుకొని మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీరు చేసిన చిన్నచిన్న ఉద్యోగాల గురించీ, వాటిలో నిర్వహించిన బాధ్యతల గురించీ బయోడేటాలో వివరంగా పొందుపర్చండి. వీలుంటే ఎన్‌పీటీఈఎల్‌, కోర్స్‌ఎరా, యుడెమీ లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, డేటా సైన్స్‌ లాంటి కోర్సులను చేసే ప్రయత్నం చేయండి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని