నిర్ణయం సరైనదేనా?

డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. తర్వాత ఆర్‌ఆర్‌బీ నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ ఉద్యోగాలకు కోచింగ్‌ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ నిర్ణయం సరైనదేనా?....

Published : 14 Jun 2022 00:31 IST

డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. తర్వాత ఆర్‌ఆర్‌బీ నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ ఉద్యోగాలకు కోచింగ్‌ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ నిర్ణయం సరైనదేనా?

- ఎన్‌. శ్రీకాంత్‌

* డిగ్రీ చదువుతూనే/ డిగ్రీ పూర్తి అయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమవడం మంచిదే. ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తవ్వాలనే నిబంధన ఉంటుంది. కోచింగ్‌ తీసుకోవడానికైతే నిబంధనలేమీ ఉండవు. మీరు రాయబోయే పోటీపరీక్షలకు డిగ్రీలో నిర్ధారించిన మార్కుల శాతం మీకు ఉన్నట్లయితే నిరభ్యంతరంగా కోచింగ్‌లో చేరండి. ఒక్కో పరీక్షకు ఒక్కో కోచింగ్‌ తీసుకొనే బదులు, అన్ని పరీక్షలకు ఉపయోగపడే సబ్జెక్టుల్లో ఒకే కోచింగ్‌ తీసుకోవడం మేలు. సిలబస్‌నూ, పాత ప్రశ్నపత్రాలనూ క్షుణ్ణంగా పరిశీలించి సన్నద్ధత వ్యూహాన్ని తయారు చేసుకొని, పాటించండి. విజయం సాధించండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని