కరస్పాండెన్స్‌ బీఈడీ?

బీఈడీ దూరవిద్యా కోర్సు ఏ యూనివర్సిటీలో ఉంది? తమిళనాడులో బీఈడీ కరస్పాండెన్సు కోర్సు ఉందా?

Updated : 24 Oct 2022 06:44 IST

బీఈడీ దూరవిద్యా కోర్సు ఏ యూనివర్సిటీలో ఉంది? తమిళనాడులో బీఈడీ కరస్పాండెన్సు కోర్సు ఉందా?

- వి. శ్రీలలిత, నెల్లూరు

తంలో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్యా విధానంలో చాలా యూనివర్సిటీల్లో ఉండేది. బీఈడీ ప్రోగ్రామ్‌ కాలవ్యవధిని రెండు సంవత్సరాలకు పెంచాక, మారిన ఎన్‌సీటీఈ నిబంధనల దృష్ట్యా చాలా యూనివర్సిటీల్లో ఈ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం లేదు. ఎన్‌సీటీఈ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతితో మాత్రమే బీఈడీ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఈడీ ప్రోగ్రామ్‌ ఉంది. బీఈడీని దూరవిద్యలో చేయాలంటే రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ విద్యార్హతతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో కనీసం రెండేళ్ల బోధనానుభవం కచ్చితంగా ఉండాలి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తమిళనాడులో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో లేదు. వివిధ యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను తరచుగా సందర్శిస్తూ బీఈడీ ప్రోగ్రామ్‌ (దూరవిద్య/ కరస్పాండెన్స్‌) సమాచారాన్ని తెలుసుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని