అదనంగా ఏ కోర్సులు మేలు?

ఎంబీయే (మార్కెటింగ్‌) చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. మార్కెటింగ్‌ సంబంధిత కోర్సులు ఇంకా ఏమైనా ఉంటే చెప్పగలరు.

Published : 31 Oct 2022 01:02 IST

ఎంబీయే (మార్కెటింగ్‌) చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. మార్కెటింగ్‌ సంబంధిత కోర్సులు ఇంకా ఏమైనా ఉంటే చెప్పగలరు.

- డి.సతీష్‌

* ఎంబీఎ మార్కెటింగ్‌ చేశాక మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, కంటెంట్‌ మార్కెటింగ్‌, బ్రాండింగ్‌, అడ్వర్ట్టైజింగ్‌, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్‌, కస్టమర్‌ సెంట్రిక్‌ మార్కెటింగ్‌, డేటా మైనింగ్‌, మార్కెటింగ్‌ అనలిటిక్స్‌, వెబ్‌ అనలిటిక్స్‌, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ రీసెర్చ్‌ లాంటి కోర్సుల్లో మీకు ఆసక్తి ఉన్నవి చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. సాధారణంగా ఎంబీఏ మంచి కళాశాలలో చేస్తే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లోనే ఉద్యోగం వస్తుంది. అలా రానిపక్షంలో, పైన చెప్పిన కోర్సుల్లో కనీసం రెండు చేసే ప్రయత్నం చేయండి. వీటిని ఐఐఎం, మైకా లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చేస్తే మెరుగైన  ఉద్యోగాలు లభిస్తాయి. అవకాశం ఉంటే, ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రయత్నించండి. మీ పనితీరు నచ్చితే, అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని