పర్యావరణ కోర్సు పూర్తిచేస్తే?

పర్యావరణ కోర్సులకు విదేశాల్లో చాలా డిమాండ్‌ ఉంది. యూఎస్‌లో ఈ కోర్సు చేశాక వివిధ వస్తువుల తయారీ పరిశ్రమల్లో, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ, రిఫైనరీ, బోధన ,పరిశోధన రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.

Updated : 20 Dec 2022 06:23 IST

బీఎస్సీ గ్రాడ్యుయేట్‌ని. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ చదివాను. యూఎస్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ పీజీ చేయాలనుంది. ఈ కోర్సుతో ఉండే ఉద్యోగావకాశాలు ఏమిటి?

 రామ్‌నాథ్‌

పర్యావరణ కోర్సులకు విదేశాల్లో చాలా డిమాండ్‌ ఉంది. యూఎస్‌లో ఈ కోర్సు చేశాక వివిధ వస్తువుల తయారీ పరిశ్రమల్లో, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ, రిఫైనరీ, బోధన ,పరిశోధన రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఎన్విరాన్‌మెంటల్‌ కోర్సు చేసినవారు పర్యావరణ శాస్త్రవేత్త, అధ్యాపకుడు, పర్యావరణ పాత్రికేయుడు, పర్యావరణ అధికారి, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, క్లైమేట్‌ కంట్రోలర్‌ ఉద్యోగాలు చేయటానికి వీలుంటుంది. ఇంకా ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌, సస్టెయినబిలిటీ కన్సల్టెంట్‌, నేచర్‌ కన్జర్వేషన్‌ ఆఫీసర్‌, పర్యావరణ విద్యాధికారి.. ఈ హోదాల్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి. .
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని