పరిశోధన ఏ విదేశీ వర్సిటీలో మేలు?

మా అమ్మాయి యానిమల్‌ హజ్బెండరీలో పీజీ పూర్తిచేసింది. ఇదే ఫీల్డ్‌లో రిసెర్చ్‌ చేయాలనుకుంటోంది.

Updated : 27 Dec 2022 04:56 IST

మా అమ్మాయి యానిమల్‌ హజ్బెండరీలో పీజీ పూర్తిచేసింది. ఇదే ఫీల్డ్‌లో రిసెర్చ్‌ చేయాలనుకుంటోంది. ఏ విదేశీ యూనివర్సిటీల్లో మంచి అవకాశాలుంటాయి? 

కె.ప్రసాద్‌

*యానిమల్‌ హజ్బెండరీ రంగంలో విదేశాల్లో పరిశోధన చేయాలనుకోవడం అభినందనీయం. యూకేలో యానిమల్‌ హజ్బెండరీలో పరిశోధన చేయాలంటే యూనివర్శిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ నాటింగ్‌ హామ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో, యూనివర్శిటీ ఆఫ్‌ గ్లాస్గో, యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌లను పరిగణించవచ్చు. కెనడాలో వెస్టర్న్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ మెడిసిన్‌, అంటారియో వెటర్నరీ కాలేజ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ గుల్ఫ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ కాల్గెరి, ఆస్ట్రేలియాలో యూనివర్శిటీ ఆఫ్‌ సిడ్నీ, యూనివర్శిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌, యూనివర్శిటీ ఆఫ్‌ క్వీన్స్‌ లాండ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ అడిలైడ్‌, చార్లెస్‌ స్టర్ట్‌ యూనివర్శిటీల్లో కూడా ఈ రంగంలో పరిశోధనకు అవకాశాలున్నాయి. యూఎస్‌లో యూనివర్శిటీ ఆఫ్‌ ఆరిజోనా, పర్ద్యూ యూనివర్శిటీ, కెంట్‌ స్టేట్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌, యూనివర్శిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ల్లో కూడా యానిమల్‌ హజ్బెండరీ పరిశోధన చేయవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని