పనిచేస్తూ పీహెచ్‌డీ?
పీజీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) మొదటి ఏడాది చదువుతున్నాను. పీహెచ్‌డీలో ఏ టాపిక్‌ను ఎంచుకుంటే మంచిది? ఫార్మా కంపెనీలో పనిచేస్తూ పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుందా?
పీజీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) మొదటి ఏడాది చదువుతున్నాను. పీహెచ్‌డీలో ఏ టాపిక్‌ను ఎంచుకుంటే మంచిది? ఫార్మా కంపెనీలో పనిచేస్తూ పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుందా?
పి. రాజ్‌కుమార్
* పీజీ మొదటి సంవత్సరం చదివేటప్పుడే పీహెచ్‌డీ గురించి ఆలోచించడం అభినందనీయం. మంచి విద్యాసంస్థలో పీహెచ్‌డీ చేయాలంటే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాథమిక అంశాలపై గట్టి పట్టుండాలి. మీ అధ్యాపకులతో తరచూ మాట్లాడుతూ ఆర్గానిక్ కెమిస్ట్రీ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసుకుంటూ ఉండండి. అవకాశం ఉంటే అధ్యాపకుల మార్గదర్శకత్వంలో ఏదైనా ప్రాజెక్ట్ చేయండి. వారి పరిశోధనలో మీరూ భాగం అయ్యే అవకాశాల గురించి తెలుసుకోండి. పీహెచ్‌డీ చేసే సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సీఎస్‌ఐఆర్ జేఆర్‌ఎఫ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఫెలోషిప్ పొందే ప్రయత్నం చేయండి.
ప్రముఖ విశ్వవిద్యాలయాల కెమిస్ట్రీ విభాగాల్లో నిర్వహించే వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, సింపోజియంలు, కాన్ఫరెన్సుల్లో పాల్గొంటే మీ సబ్జెక్టులో జరుగుతున్న తాజా పరిశోధనలపై అవగాహన వస్తుంది. వీలుంటే వేసవి సెలవుల్లో యూనివర్సిటీలో కానీ, పరిశ్రమల్లో కానీ ఇంటర్న్‌షిప్ చేసే ప్రయత్నం చేయండి. మీ సబ్జెక్టుతో పాటు కెమిస్ట్రీ/ ఆర్గానిక్ కెమిస్ట్రీల పరిశోధన పత్రాలను చదువుతూ సీనియర్‌లతో, సహాధ్యాయులతో, అధ్యాపకులతో, శాస్త్రవేత్తలతో చర్చించండి.
ఏదైనా ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం పీహెచ్‌డీ చేయడం శ్రేయస్కరం కాదు. కెమిస్ట్రీ లాంటి సైన్స్ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీని పార్ట్ టైమ్ పద్ధతిలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదు. సాధ్యమైనంతవరకు పీహెచ్‌డీని ఫుల్‌టైమ్ విధానంలో చేయడం మంచిది. కెమిస్ట్రీలో పరిశోధన అంటే ఎక్కువభాగం ల్యాబ్‌లోనే చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రయోగశాలల్లో రాత్రంతా పరిశోధన చేయాల్సిన అవసరమూ ఉండొచ్చు. పీహెచ్‌డీని ప్రముఖ విద్యాసంస్థల్లో, ప్రముఖ అధ్యాపకుల పర్యవేక్షణలో చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు అడ్మిషన్ ఇంటర్వ్యూకి వెళ్లేప్పటికి కనీసం ఒక మంచి పరిశోధన పత్రాన్ని ప్రచురించివుంటే మీకు పీహెచ్‌డీలో సీటు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!