నోటిఫికేషన్స్

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ నిర్వహిస్తున్న సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ (మహిళా డిగ్రీ కళాశాల) 2023-24 విద్యా సంవత్సరానికి బీఏ ఆనర్స్‌ కోర్సులో ప్రవేశానికి తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది

Published : 04 May 2023 00:32 IST

ప్రవేశాలు

సిరిసిల్ల ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో బీఏ (ఆనర్స్‌) ప్రోగ్రాం

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ నిర్వహిస్తున్న సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ (మహిళా డిగ్రీ కళాశాల) 2023-24 విద్యా సంవత్సరానికి బీఏ ఆనర్స్‌ కోర్సులో ప్రవేశానికి తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రోగ్రాం వ్యవధి మూడేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.
1. బీఏ (ఆనర్స్‌) ఫ్యాషన్‌ డిజైన్‌: 60 సీట్లు
2. బీఏ (ఆనర్స్‌) ఇంటీరియర్‌ డిజైన్‌: 40 సీట్లు
3. బీఏ (ఫొటోగ్రఫీ అండ్‌ డిజిటల్‌ ఇమేజింగ్‌): 20 సీట్లు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60% మార్కులతో 2022, 2023 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన మహిళా విద్యార్థులు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
వయసు: 01-07-2023 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.300.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2023.
వెబ్‌సైట్‌:https://ttwrdcs.ac.in/


ఎన్‌ఎస్‌యూటీ, న్యూదిల్లీలో బీ డిజైన్‌

న్యూదిల్లీలోని నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఎస్‌యూటీ) 2023-24 విద్యా సంవత్సరానికి బీ డిజైన్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఇన్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ (బీడీపీడీ)
2. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఇన్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీడీఎఫ్‌టీ)
మొత్తం సీట్లు: 60
వ్యవధి: 4 సంవత్సరాలు
అర్హత: 12వ తరగతితో పాటు యూసీఈఈడీ/ డిజైన్‌/ ఫ్యాషన్‌ టెక్నాలజీ/ ఫ్యాషన్‌ డిజైన్‌ ప్రవేశపరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
రౌండ్‌-1 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29-05-2023.
రౌండ్‌-2 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-07-2023.
వెబ్‌సైట్‌: http://www.nsut.ac.in/


ఐఐఎఫ్‌టీ కాకినాడలో ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, కాకినాడ క్యాంపస్‌  2023-28 విద్యా సంవత్సరానికి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (బీబీఏ- బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ ఎంబీఏ - ఇంటర్నేషనల్‌ బిజినెస్‌) లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: 60% మార్కులతో ఆర్ట్స్‌/కామర్స్‌/సైన్స్‌ స్ట్రీమ్‌లో 10+2/ పన్నెండో తరగతి (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు 55%) 2021, 2022, 2023లో ఉత్తీర్ణులై ఉండాలి.  మ్యాథమెటిక్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
వయసు: అభ్యర్థి 01-07-2003 తర్వాత జన్మించి ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్‌/ జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.2000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-05-2023.
వెబ్‌సైట్‌:https://www.iift.ac.in/iift/ipm.php


ఈఎస్‌సీఐ, హైదరాబాద్‌లో పీజీడీఎం

హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌సీఐ), స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌ 2023-2024 విద్యా సంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌.
వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ, ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌)తో పాటు క్యాట్‌/ మ్యాట్‌/ ఏటీఎంఏ, ఐసెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి,
ఎంపిక: క్యాట్‌/ మ్యాట్‌/ ఏటీఎంఏ, ఐసెట్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31-07-2023.
వెబ్‌సైట్‌:https://esci.edu.in/


కేఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీలో పీహెచ్‌డీ, పీడీఎఫ్‌ ప్రోగ్రాం

కేఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ, విజయవాడ, హైదరాబాద్‌ క్యాంపస్‌ 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ, పీడీఎఫ్‌ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.  
1. పీహెచ్‌డీ ప్రోగ్రాం(ఫుల్‌/ పార్ట్‌ టైం)
ఇంజినీరింగ్‌ విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ.
సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, ఫార్మసీ, ఫిజిక్స్‌, మేనేజ్‌మెంట్‌.
2. పీడీఎఫ్‌ ప్రోగ్రాం (ఫుల్‌ టైం): ఇంజినీరింగ్‌ అండ్‌ సైన్సెస్‌
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ.
దరఖాస్తులకు చివరి తేదీ: 04-06-2023.
ప్రవేశ పరీక్ష: 25-06-2023.
ఇంటర్వ్యూ తేదీ: 20-07-2023.
వెబ్‌సైట్‌: https://www.kluniversity.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని