త్వరగా ఉద్యోగం వచ్చేలా..
ఆరేళ్ల కిందట బీటెక్ చేశాను. వ్యక్తిగత సమస్యల వల్ల ఉద్యోగం చేయలేదు. ఇప్పుడు ఏ కోర్సు చేస్తే త్వరగా ఉద్యోగం సంపాదించొచ్చు?
ఆరేళ్ల కిందట బీటెక్ చేశాను. వ్యక్తిగత సమస్యల వల్ల ఉద్యోగం చేయలేదు. ఇప్పుడు ఏ కోర్సు చేస్తే త్వరగా ఉద్యోగం సంపాదించొచ్చు?
ఎన్.చైతన్య
* మీరు బీటెక్ చేసి ఆరు సంవత్సరాలు అయిందని చెప్పారు. కానీ ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి చదివారు, మార్కుల శాతం ఎంత అనే విషయాలు తెలపలేదు. ఆ వివరాలు కూడా చెప్పుంటే మీకు సరైన సూచన ఇవ్వడానికి వీలుండేది. సాధారణంగా బీటెక్ చేసినవారు త్వరగా ఉద్యోగం పొందాలనుకొంటే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ప్రోగ్రామింగ్ కోర్సులు చేయవచ్చు. అవేకాకుండా డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, డేటా విజువలైజేషన్ లాంటివి కూడా చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే కంప్యూటర్ హార్డ్‌వేర్ కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది. మీరు బీటెక్‌లో చదివిన బ్రాంచితో ఆ రంగంలో ఉపాధికి ప్రయత్నాలు చేయవచ్చు. డిగ్రీ చదివి చాలాకాలం అయింది కాబట్టి, ఉద్యోగానుభవం లేకుండా ఉద్యోగం రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మీకు మరో రెండు/మూడు సంవత్సరాలు చదివే ఓపిక ఉంటే, ఏదైనా ప్రముఖ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేయొచ్చు. మీ అభిరుచిని బట్టి జర్నలిజం, ఎంసీఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ, సైకాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ లాంటి కోర్సులు చదివి, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవచ్చు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్