ఎంఎల్‌టీ డిగ్రీ తర్వాత ఏ కోర్సు మేలు?

బీఎస్సీ (మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ) ఫైనల్‌ ఇయర్‌ చేస్తున్నాను. ఎమ్మెస్సీ ఏ సబ్జెక్టులతో చదివితే ఉద్యోగావకాశాలు బాగుంటాయి?

Published : 13 Feb 2024 00:11 IST

బీఎస్సీ (మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ) ఫైనల్‌ ఇయర్‌ చేస్తున్నాను. ఎమ్మెస్సీ ఏ సబ్జెక్టులతో చదివితే ఉద్యోగావకాశాలు బాగుంటాయి?

సాయి

బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌టీ) చదివిన తరువాత మాస్టర్స్‌ ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో క్లినికల్‌ బయోకెమిస్త్రీ, మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, అనస్థీషియా అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, క్లినికల్‌ బయాలజీ, టాక్సికాలజీ, ఇమ్యునాలజీ, హెమటాలజీ, పాథాలజీ, సైటాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాంటి సబ్జెక్టులతో ఎమ్మెస్సీ చేస్తే మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొన్ని యూనివర్సిటీలు బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ చదివినవారికి సంప్రదాయ కోర్సులైన బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయో టెక్నాలజీ లాంటి వాటిలోనూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మీకు మేనేజ్‌మెంట్‌/ అడ్మినిస్ట్రేషన్‌పై ఆసక్తి ఉంటే ఎంబీఏ (హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సు గురించి కూడా ఆలోచించండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని