ఆ రాష్ట్రంలో తొలి గ్రామ అట్లాస్‌ ఆవిష్కరణ!

చేతివృత్తులపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ, రుణ సౌకర్యం ఇచ్చి ఉపాధి కల్పించే ‘విశ్వకర్మ’ పథకాన్ని ప్రధాని మోదీ ప్రవేశపెట్టారు.

Updated : 02 Sep 2023 06:06 IST

కరెంట్‌ అఫైర్స్‌

చేతివృత్తులపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ, రుణ సౌకర్యం ఇచ్చి ఉపాధి కల్పించే ‘విశ్వకర్మ’ పథకాన్ని ప్రధాని మోదీ ప్రవేశపెట్టారు. చెస్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు చెందిన ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారుడితో హోరాహోరీగా తలపడి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు. ఉచితంగా ఐవీఎఫ్‌ సేవలు అందించనున్న రాష్ట్రంగా గోవా నిలిచింది. అగ్రరాజ్యాన్ని ఇటీవల హిల్లరీ తుపాను కుదిపేయగా, అణు వ్యర్థ జలాలను జపాన్‌ పసిఫిక్‌ మహాసముద్రంలోకి వదిలిపెట్టడం ప్రాంతీయంగా ఉద్రిక్తతలకు కారణమైంది. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలతో పాటు క్రీడలు, నియామకాలు, పురస్కారాలు, వార్తల్లో వచ్చిన సంఘటనలు, వాటి పూర్వాపరాలను పోటీ పరీక్షార్థులు ఎప్పటికప్పుడు సమగ్రంగా తెలుసుకోవాలి.

మాదిరి ప్రశ్నలు

1. దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్‌ పోస్టాఫీస్‌ను ఇటీవల బెంగళూరులో ప్రారంభించారు. దేశంలోని ఏ ఐఐటీ సహకారంతో ‘ఎల్‌ అండ్‌ టీ’ సంస్థ దీన్ని నిర్మించింది?

1) ఐఐటీ దిల్లీ   2) ఐఐటీ మద్రాస్‌  

3) ఐఐటీ రూర్కీ   4) ఐఐటీ ఖరగ్‌పుర్‌

2. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘యూత్‌ 20 సమ్మిట్‌ 2023’ ఎక్కడ జరిగింది?

1) దిల్లీ   2) కోల్‌కతా  3) కాన్పుర్‌ 4) వారణాసి

3. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విశ్వకర్మ పథకానికి సంబంధించి సరైంది?

ఎ) ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారికి రాయితీపై కేంద్రం రుణాలు మంజూరు చేయనుంది.

బి) గరిష్ఠంగా 5% వడ్డీ రేటుతో రుణాలు పొందొచ్చు. ఇందుకోసం రూ.13 వేల కోట్లను కేంద్రం వెచ్చించనుంది.

సి) చేతివృత్తులు నేర్చుకోవాలనే వారి కోసం ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానుంది.

డి) శిక్షణ సమయంలో రోజుకు రూ.500 ఉపకార వేతనం, తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తారు.

1) ఎ, బి, సి   2) ఎ, బి, సి, డి

3) బి, సి, డి   4) సి, డి

4. దేశంలో మొదటిసారి ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) చికిత్సను ఉచితంగా ఇవ్వనున్న రాష్ట్రం ఏది?

1) కర్ణాటక   2) తమిళనాడు  

3) మహారాష్ట్ర   4) గోవా

5. ఇటీవల రతన్‌ టాటాకు ‘ఉద్యోగరత్న’ అవార్డును ప్రకటించారు. ఈ పురస్కారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

1) కేరళ   2) తెలంగాణ  

3) ఉత్తర్‌ప్రదేశ్‌   4) మహారాష్ట్ర

6. గుండెపోటు మరణాల నివారణకు STEMI ప్రాజెక్టుకు ఇటీవల శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఏది?

1) తెలంగాణ 2) ఉత్తర్‌ప్రదేశ్‌

3) ఆంధ్రప్రదేశ్‌   4) కేరళ

7. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు ఎవరు?

1) పి.టి.ఉష   2) ఆదిల్‌ సుమరివాలా

3) బ్రిజ్‌ భూషణ్‌   4) జె.షా

8. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023, ఆగస్టు 17న ప్రారంభించిన ‘INS-వింధ్యగిరి’కి సంబంధించి సరైనవి?

ఎ) INS-వింధ్యగిరి’ని గార్డెన్‌ రీచ్‌షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ GRACE నిర్మించింది.

బి) కోల్‌కతాలోని హుగ్లీ తీరంలో ఈ నౌకను ఆగస్టు 17న ఇండియన్‌ నేవీలో ప్రవేశపెట్టారు.

సి) దీని పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు, వేగం 28 నాట్స్‌.

డి)  PROJECT 17 A  కింద స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐదో యుద్ధనౌక INS-వింధ్యగిరి.

1) ఎ, బి, సి, డి   2) ఎ, బి, సి  

3) బి, సి, డి 4) సి, డి

9. అమెరికా పంపిన క్యూరియాసిటీ రోవర్‌ ఏ గ్రహం ఉపరితలంపై పురాతన పగుళ్లను కనిపెట్టింది?

1) అంగారకుడు (కుజుడు) 2) శని  

3) బృహస్పతి   4) బుధుడు

10. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి దేశంలో మొదటి ‘యూనిటీ మాల్‌’ను ఇటీవల ఏ నగరంలో ఏర్పాటు చేశారు?

1) భోపాల్‌ 2) లఖ్‌నవూ  

3) ఉజ్జయిని   4) హైదరాబాద్‌

11. కిందివారిలో ఇటీవల ఎవరికి భారత పౌరసత్వం లభించింది?

1) అక్షయ్‌ కుమార్‌   2) సల్మాన్‌ ఖాన్‌

3) షారుక్‌ ఖాన్‌ 4) ఆమీర్‌ ఖాన్‌

12. భారతదేశ తొలి ‘గ్రామ అట్లాస్‌’ను ఇటీవల ఏ రాష్ట్రం ఆవిష్కరించింది (మయెమ్‌ అనే గ్రామ అట్లాస్‌)?

1) మహారాష్ట్ర   2) గోవా  

3) కేరళ 4) తమిళనాడు

13. ఇటీవల జీ20 దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

1) చెన్నై   2) గాంధీ నగర్‌  

3) కోల్‌కతా   4) ముంబయి

14. 2023, ఆగస్టు 25న 31,000 పాఠశాలలు, 17 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందే విధంగా దేశంలోనే తొలిసారి ‘సీఎం అల్పాహార పథకం’ను ప్రారంభించిన రాష్ట్రం?

1) కర్ణాటక   2) కేరళ

3) తమిళనాడు   4) ఆంధ్రప్రదేశ్‌

15. ఇటీవల హిల్లరీ తుపాను ఏ దేశంలో వచ్చింది?

1) జపాన్‌  2) ఫిలిపైన్స్‌  3) అమెరికా  4) చైనా

16. చెస్‌ ప్రపంచకప్‌  2023లో ఇండియాకు చెందిన ప్రజ్ఞానందపై నెగ్గిన మాగ్నస్‌ కార్లసన్‌ ఏ దేశానికి చెందినవారు?

1) కెనడా  2) స్పెయిన్‌  3) రష్యా   4) నార్వే

17. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

1) జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

2) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ  

3) జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ 4) జస్టిస్‌ నాగరత్న

18. భారత ఎన్నికల సంఘం ‘నేషనల్‌ ఐకాన్‌’గా ఎవరిని నియమించింది?

1) సచిన్‌           2) ధోని  

3) కోహ్లి           4) సూర్యకుమార్‌ యాదవ్‌

19. ఇటీవల ఏ దేశంపై ఆఫ్రికన్‌ యూనియన్‌ సస్పెన్షన్‌ను విధించింది?

1) ఈజిప్టు   2) నైగర్‌  

3) జింబాబ్వే   4) ఇథియోపియా

20. ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?

1) కోహ్లి  2) నాదల్‌   3) జకోవిచ్‌  4) ధోని

21. అజర్‌ బైజాన్‌లో జరిగిన ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చైనా (15 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలు) మొదటి స్థానంలో నిలవగా 6 స్వర్ణాలు, 8 కాంస్యాలతో భారత్‌ ఏ స్థానంలో నిలిచింది?

1) 3      2) 4      3) 6      4) 2

22. ప్రపంచంలో మొదటి దివిబి (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) టర్మినల్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

1) గుజరాత్‌లోని కాండ్ల  

2) గుజరాత్‌లోని భావ్‌నగర్‌  

3) మహారాష్ట్రలోని ముంబయి  

4) కర్ణాటకలోని మంగుళూరు

23. కిందివాటిలో సరైంది?

ఎ) చంద్రయాన్‌  3లోని ‘విక్రమ్‌’ ల్యాండర్‌ చంద్రుడిపై దిగిన ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్‌గా’ మోదీ పేరు పెట్టారు.

బి) చంద్రయాన్‌  3లోని విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన రోజైన ఆగస్టు 23ను ‘నేషనల్‌ స్పేస్‌ డే’గా మోదీ ప్రకటించారు.

సి) చంద్రయాన్‌  2 క్రాస్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశానికి ‘తిరంగా’ అని మోదీ పేరుపెట్టారు.

1) ఎ, బి   2) బి, సి  3) ఎ, సి  4) ఎ, బి, సి

24. మొదటి ‘ట్రెడిషనల్‌ మెడిసిన్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2023 ఆగస్టులో కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎక్కడ జరిగింది?

1) పనాజీ   2) కోల్‌కతా  

3) గాంధీనగర్‌ 4) హైదరాబాద్‌

25. శ్రీత్త తవిసిన్‌ (Srettha Thavisin) ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల నియమితులయ్యారు?

1) థాయిలాండ్‌   2) కంబోడియా  

3) ఈజిప్టు   4) ఉత్తర సూడాన్‌

26. 2011లో సంభవించిన సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రంలో పేరుకుపోయిన రేడియోధార్మిక వ్యర్థ జలాలను పసిఫిక్‌ మహాసముద్రంలోకి ఏ దేశం విడుదల చేయడాన్ని  చైనా, దక్షిణ కొరియా వ్యతిరేకించాయి?

1) సింగపూర్‌   2) రష్యా  

3) జపాన్‌   4) ఇండొనేసియా

27. 2022  23 సంవత్సరాల్లో దేశంలో చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ 7వ, తెలంగాణ 6వ స్థానాల్లో నిలిచాయి. అయితే మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు?

1) మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌పదేశ్‌, గుజరాత్‌

2) గుజరాత్‌, మహారాష్ట్ర, బిహార్‌

3) మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌

4) మహారాష్ట్ర, బిహార్‌, గుజరాత్‌

28. గిరిజన ప్రాంతాల్లోని రోడ్లను పెద్ద రహదారులతో కలిపేందుకు ‘భగవాన్‌ బిర్సాముండా రోడ్‌’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

1) గుజరాత్‌ 2) రాజస్థాన్‌  

3) మహారాష్ట్ర   4) గోవా

29. కిందివాటిలో సరైంది.

ఎ) 2023, ఆగస్టులో బ్రిక్స్‌ సమావేశం దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో జరిగింది.

బి) 2024, జనవరి 1 నుంచి అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈలు బ్రిక్స్‌లో చేరనున్నాయి.

సి) బ్రిక్స్‌ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఇథియోపియా ప్రధాని అహ్మద్‌ అలీ, సెనగల్‌ అధ్యక్షుడు మ్యాకీసల్‌, ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, మొజాంబిక్‌ అధ్యక్షుడు ఫిలిప్‌ న్యూసీతో భేటీ అయ్యారు.

డి) 2024 బ్రిక్స్‌ సమావేశం రష్యాలోని కజాన్‌ నగరంలో జరగనుంది.

 1) ఎ, బి   2) ఎ, బి, సి  

3) ఎ, బి, డి     4) ఎ, బి, సి, డి

30. 2023, ఆగస్టు 22న మరణించిన కల్వంపూడి రాధాకృష్ణ (సి.ఆర్‌.రావు)కు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్‌ పురస్కారం వచ్చింది?

1) 2002   2) 2001   3) 1968  4) 2006

31. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏఐ ఆధారిత స్కూల్‌ను ప్రారంభించారు (శాంతిగిరి విద్యాభవన్‌ స్కూల్‌లో)?

1) రాజస్థాన్‌ 2) గుజరాత్‌ 3) కేరళ 4) మహారాష్ట్ర

32. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) జాతీయ సమగ్రత చిత్రం  RRR

బి) ఉత్తమ చిత్రం  పుష్ప

సి) ఉత్తమ నటుడు  అల్లు అర్జున్‌

డి) ఉత్తమ నటి  అలియాభట్‌, కృతిసనన్‌

ఇ) ఉత్తమ బాలల చిత్రం  గాంధీ అండ్‌ కో (గుజరాతి)

1) ఎ, బి, సి, డి, ఇ   2) సి, డి, ఇ  

3) ఎ, బి, సి, డి   4) బి, సి, డి

33. ‘గోదావరి చిత్రం’కు నిఖిల్‌ మహాజన్‌కు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి అవార్డు వచ్చింది. ఇది ఏ భాషా చిత్రం?

1) తెలుగు  2) హిందీ  3) మరాఠి  4) తమిళం

34. ఇటీవల ఏ దేశం భారత ప్రధాని మోదీకి ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఆనర్‌’ ప్రదానం చేసింది?

1) ఈజిప్టు  2) ఇథియోపియా  

3) గ్రీసు   4) ఫిజి


సమాధానాలు

12; 23; 32; 44; 54; 63; 72; 82; 91;    103; 111; 122; 132; 143; 153; 164;      173; 181; 192; 202; 214; 222; 234;    243; 251; 263; 272; 283; 294; 302; 313; 322; 333; 343.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని