జేఈఈ మెయిన్ సెషన్ -1 ప్రాథమిక కీ విడుదల.. రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ(JEE Main 2024 Session-1 Answer Key) విడుదలైంది.

Updated : 08 Feb 2024 14:57 IST

దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ(JEE Main 2024 Session-1 Answer Key) విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (NTA) మంగళవారం రాత్రి ఈ కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీలతో పాటు రెస్పాన్స్‌ షీట్‌లనూ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ కీపై అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుతో ఈ నెల 8 వరకు ఛాలెంజ్‌ చేసే వెసులుబాటును కల్పించింది. 8న రాత్రి 11 గంటలు దాటితే అభ్యంతరాలను స్వీకరించరు. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు సరైనవే అయితే.. ఆన్సర్‌ కీని సవరించి తుది కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు పరీక్ష 12,95,617మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 12,25,529మంది హాజరైన విషయం తెలిసిందే.

ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని