JEE Main Final Key: జేఈఈ (మెయిన్‌) సెషన్‌ -1 తుది కీ విడుదల

JEE Main 2024 Session-1 Answer Key: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 తుది ఆన్సర్‌ కీ వచ్చేసింది.

Updated : 12 Feb 2024 14:54 IST

JEE Main 2024 Final Key | దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల తుది ఆన్సర్‌ కీ (JEE Main 2024 Session-1 Answer Key) విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (NTA) సోమవారం పేపర్‌ -1 ‘ఫైనల్‌ ఆన్సర్‌ కీ’ని విడుదల చేసింది. త్వరలోనే ఫలితాలను ఫలితాలను వెల్లడించనుంది. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు దేశ వ్యాప్తంగా 12,95,617మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 12,25,529 మంది హాజరైన సంగతి తెలిసిందే.

తుది ఆన్సర్‌ కీ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని