JEE Main 2024: జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) పరీక్ష తేదీల్లో మార్పు.. దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షల తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ పరీక్షను ఏప్రిల్‌ 4 నుంచి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 04 Feb 2024 14:54 IST

JEE Main 2024 Applications | ఇంటర్నెట్‌  డెస్క్‌:  జేఈఈ మెయిన్‌ తుది విడత (సెషన్‌ 2) పరీక్షల తేదీల్లో ఎన్‌టీఏ మార్పు చేసింది. ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య జరుగుతాయని పేర్కొన్న విషయం తెలిసిందే.  సీబీఎస్‌ఈ పరీక్షల నేపథ్యంలోనే ఈ తేదీల్లో మార్పు చేసింది. ఫిబ్రవరి 1వ తేదీతో తొలి విడత (సెషన్‌ 1) పరీక్షలు ముగియడంతో, సెషన్‌- 2కు దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది.  అయితే, గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని NTA తెలిపింది. JEE Main Session 2 పరీక్షకు మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని