GATE 2024: ‘గేట్‌’లో రైతుబిడ్డ సత్తా.. 171వ ర్యాంకుతో మెరిసిన వైజాగ్‌ యువతి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని.. తొలి ప్రయత్నంలోనే గేట్‌ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించి అదరగొట్టడం వెనుక సంధ్య చేసిన కృషి ఆమె మాటల్లోనే..

Published : 18 Mar 2024 22:56 IST

విశాఖ: బీటెక్‌ పూర్తికాగానే చాలా మంది విద్యార్థులు గేట్‌ పరీక్షలో మంచి ర్యాంకు కోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. జేఈఈ కన్నా అత్యంత కఠినమైన పరీక్షగా పేరొందిన ఈ పరీక్షలో మంచి స్కోరు కోసం ఏటా లక్షలాది మంది పోటీ పడుతుంటారు. అందులో కొందరు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంటారు. ఇటీవల విడుదలైన గేట్‌ 2024 ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 171వ ర్యాంకు సాధించి సత్తా చాటింది విశాఖకు చెందిన రైతు బిడ్డ సంధ్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని.. తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించి అదరగొట్టింది. జాతీయ స్థాయిలో గొప్ప ర్యాంకు సాధించడం వెనుక సంధ్య చేసిన కృషి ఆమె మాటల్లోనే..



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని