దుర అనర్థాలకు వృక్ష రక్ష!

మద్యం, పొగ తాగటం వంటి దురలవాట్లను వదిలించుకోలేకపోతున్నారా? వీటితో తలెత్తే అనర్థాలను తప్పించుకోలేకపోతున్నామని...

Published : 31 Dec 2019 00:10 IST

ద్యం, పొగ తాగటం వంటి దురలవాట్లను వదిలించుకోలేకపోతున్నారా? వీటితో తలెత్తే అనర్థాలను తప్పించుకోలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే తాజా కూరగాయలు, పండ్లు ఇంకాస్త ఎక్కువగా తీసుకోవటం మొదలెట్టండి. వీటికి రుచిని తెచ్చిపెట్టే ఫ్లేవనాయిడ్లు ఒంట్లో వాపు ప్రక్రియ నివారణకూ తోడ్పడతాయి. ఇవి మరణించే ముప్పును తగ్గిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఫ్లేవనాయిడ్ల ప్రభావం పొగ అలవాటు గలవారిలో, అతిగా మద్యం తాగేవారిలో మరింత ఎక్కువగా ఉంటుండటం విశేషం. దురలవాట్ల అనర్థాలను ఇవి పూర్తిగా తొలగించలేకపోవచ్చు గానీ కొంతవరకైనా రక్షణ కల్పిస్తాయన్నది మాత్రం నిజం. అందువల్ల జామ, అరటి, యాపిల్‌, పాలకూర, గోబీపువ్వు, క్యాబేజీ, తేయాకు వంటివి తరచూ తీసుకోవటం మేలు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని