మా ‘మంచి’ నియాసిన్‌!

మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) స్థాయులను పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే ...

Published : 10 Mar 2020 00:35 IST

మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) స్థాయులను పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే నియాసిన్‌ (విటమిన్‌ బి3) మీదా దృష్టి పెట్టండి. ఇది రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌)ను కాలేయానికి చేరవేస్తుంది. ఇలా రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగకుండా, గుండె జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. అందుకే మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగటానికి చికిత్సలో భాగంగా డాక్టర్లు దీన్నీ సూచిస్తుంటారు. మనం తిన్న ఆహారం శక్తిగా మారటంలోనూ నియాసిన్‌ పాలు పంచుకుంటుంది. నాడులు, జీర్ణవ్యవస్థ, చర్మం ఆరోగ్యంగా ఉండటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని మన శరీరం తయారుచేసుకోలేదు. ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. నియాసిన్‌ నీటిలో కరిగే విటమిన్‌. అందువల్ల ఒంట్లో నిల్వ ఉండదు. ఆహారం ద్వారా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందే. పెద్దవాళ్లకైతే రోజుకు 14-16 మి.గ్రా. నియాసిన్‌ అవసరం. ఇది మాంసాహారంలో దండిగా ఉంటుంది. ముఖ్యంగా కార్జం (కాలేయం), చికెన్‌తో పాటు టూనా, టర్కీ, సాల్మన్‌ చేపల్లో ఎక్కువగా ఉంటుంది. దంపుడు బియ్యం, పొట్టు తీయని గోధుమలు, పుట్టగొడుగులు, పచ్చి బఠానీలు, బంగాళాదుంపలు, వేరుశనగ వంటి వాటితోనూ లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని