దద్దు కూడా..

కొత్త కరోనా జబ్బు లక్షణాలు అనగానే జ్వరం, దగ్గు, ఆయాసం వంటివే ముందుగా వినిపిస్తుంటాయి. లోతుకు వెళ్తున్న కొద్దీ కొత్త సంగతులెన్నో బయటపడుతున్నాయి. కరోనా జబ్బు బారినపడ్డవారిలో చర్మం మీద దద్దు వంటి లక్షణాలూ కనిపిస్తున్నట్టు

Published : 28 Apr 2020 01:11 IST

కొత్త కరోనా జబ్బు లక్షణాలు అనగానే జ్వరం, దగ్గు, ఆయాసం వంటివే ముందుగా వినిపిస్తుంటాయి. లోతుకు వెళ్తున్న కొద్దీ కొత్త సంగతులెన్నో బయటపడుతున్నాయి. కరోనా జబ్బు బారినపడ్డవారిలో చర్మం మీద దద్దు వంటి లక్షణాలూ కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సుమారు 20% మందిలో చర్మ లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. వీరిలో సగం మందికి జబ్బు ఆరంభంలోనే ఇవి మొదలవుతుండగా.. మిగతా సగం మందికి ఆసుపత్రిలో చేరిన తర్వాత బయటపడుతున్నాయి. ఎక్కువమందిలో అక్కడక్కడా ఎర్రటి దద్దు కనిపిస్తుండగా.. మరికొందరిలో ఆటలమ్మ పొక్కుల వంటివి బయలుదేరుతున్నాయి. ఇవి చాలావరకు మెడ భాగంలో కనిపిస్తుండటం గమనార్హం. డెంగీ జ్వరంలో తలెత్తే ఎర్రటి మచ్చల వంటివీ కొందరిలో కనిపిస్తున్నాయి. సన్నటి గీతల మాదిరిగా చర్మం రంగు మారుతుండటాన్నీ పరిశోధకులు గుర్తించారు. చర్మం పైపొరలో రక్తనాళాల్లో అడ్డంకులు తలెత్తుతున్నట్టు ఇవి సూచిస్తున్నాయని వివరిస్తున్నారు. కొవిడ్‌-19 పరీక్ష అవసరాన్ని నిర్ణయించేటప్పుడు చర్మ లక్షణాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని