చురుకైన వీర్యకణాల కోసం

కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌) చికిత్సలో వీర్యకణాలు చురుకుగా కదలటం, ఎక్కువసేపు జీవించి ఉండటం, ఫలదీకరణ సామర్థ్యం మెరుగ్గా ఉండటం కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తగ్గితే గర్భధారణ అవకాశాలూ సన్నగిల్లుతుంటాయి. అందుకే వీటిని ..

Published : 17 Aug 2021 02:08 IST

కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌) చికిత్సలో వీర్యకణాలు చురుకుగా కదలటం, ఎక్కువసేపు జీవించి ఉండటం, ఫలదీకరణ సామర్థ్యం మెరుగ్గా ఉండటం కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తగ్గితే గర్భధారణ అవకాశాలూ సన్నగిల్లుతుంటాయి. అందుకే వీటిని పెంపొందించటానికి ఐఐటీ హైదరాబాద్‌, మంగళూరు యూనివర్సిటీ, కస్తూర్బా మెడికల్‌ కాలేజ్‌ పరిశోధకులు ఎంపీటీఎక్స్‌ అనే కొత్త మందును రూపొందించారు. ఇది ప్రస్తుతం కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో వాడుతున్న పెంటాక్సిఫైలిన్‌ నుంచి పుట్టుకొచ్చిందే. కాకపోతే పిండం మీద ఎలాంటి దుష్ప్రభావాలు చూపకుండా, తక్కువ మొత్తంలోనే ఎక్కువ గుణం చూపిస్తుండటం విశేషం. స్కలనం ద్వారా వచ్చిన, వృషణాల నుంచి సేకరించిన వీర్యం రెండింటిలోనూ ఇది శుక్ర కణాల కదలికలను, జీవనకాలాన్ని పెంచుతున్నట్టు బయటపడింది. కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిస్తున్న వారికిది బాగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని