జిడ్డు చర్మానికి పెరుగు

వానాకాలంలో ముఖం మీద నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువ కావటంతో మొటిమల వంటి చర్మ సమస్యలూ పెరుగుతుంటాయి.

Published : 07 Sep 2021 01:14 IST

వానాకాలంలో ముఖం మీద నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువ కావటంతో మొటిమల వంటి చర్మ సమస్యలూ పెరుగుతుంటాయి. జిడ్డు చర్మం గలవారికివి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంటాయ. ఇలాంటివారు చర్మం లోతుల నుంచి శుభ్రమయ్యేలా చూసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందుకు పెరుగు బాగా ఉపయోగ పడుతుంది. కప్పు పెరుగులో రెండు చెంచాల కాఫీ పొడి, ఒక చెంచా పసుపు వేసి ముద్దగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. పెరుగులోని లాక్టిక్‌ ఆమ్లం చర్మానికి ఎలాంటి హాని చేయకుండానే మృత కణాలను తొలగిస్తుంది. కాఫీ సారం నూనెను పీల్చుకుంటుంది. త్వరగా చర్మం పొడిబారేలా చేస్తుంది. ఇక పసుపు వాపు ప్రక్రియను తగ్గించి, దుష్ప్రభావాలను తట్టుకునేలా చర్మాన్ని బలోపేతం చేస్తుంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని