రోగనిరోధక శక్తికి శృంగారం!
ఆయుష్షు పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి? పొగ మానెయ్యాలి. రోజూ వ్యాయామం చేయాలి. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తినాలి. రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి. మద్యం అతిగా తాగొద్దు. మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో భావోద్వేగ సాన్నిహిత్యం కలిగుండాలి. ఈ జాబితాకు శృంగారాన్నీ జోడించుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇది జీవనకాలాన్ని 20 ఏళ్ల వరకు పొడిగించొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరణించే ముప్పును సగానికి తగ్గించొచ్చనీ మరికొన్ని సూచిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. శృంగారమనేది భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఆత్మీయ సంబంధంతో మానసిక బలమూ ఇనుమడిస్తుంది. ఫలితంగా కుంగుబాటు, దిగులు దరిజేరవు. శృంగారం వ్యాయామంగానూ ఉపకరిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందన్న సంగతి తెలిసిందే. తరచూ శృంగారంతో రోగనిరోధకశక్తీ బలోపేతమవుతుంది. వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ (ఐజీఏ) మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు వైక్స్ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఐజీఏ కీలక పాత్ర పోషిస్తుంది. మరి సహజంగా శృంగార జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? వ్యాయామం వంటి వాటితో పాటు తిండి మీదా కాస్త శ్రద్ధ పెట్టాలి.
* సోయా, చేపల వంటివి సెక్స్ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి.
* పలుచటి ప్రొటీన్లతో కూడిన కోడి మాంసం వంటి వాటిల్లో టైరోసైన్, ఫినైల్‌అలనైన్ ఉంటాయి. ఇవి శృంగారాసక్తి పెరిగేలా చేస్తాయి.
* తక్కువ కొవ్వు గల పెరుగు, గుడ్ల వంటివాటిల్లో కొలైన్ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే.
* పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండటానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు
-
Crime News
కారు ప్రమాదం.. కళ్లముందే నిండు గర్భిణీ, భర్త సజీవదహనం
-
World News
Mossad: ఇరాన్ క్షిపణి స్థావరంపై మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్..!
-
Politics News
nara lokesh-yuvagalam: కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా?: నారా లోకేశ్