కుంగుబాటా? ముందే మేలుకో!

రాత్రిపూట త్వరగా పడుకొని, తెల్లారి పెందలాడే లేవాలన్నది పెద్దల మాట. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాజా అధ్యయనం ఒకటి మరింత బలపరుస్తోంది. రాత్రిపూట నిద్రించే సమయం తగ్గకుండా.. రోజూ మామూలుగా నిద్ర లేచే సమయానికి

Updated : 29 Mar 2022 06:14 IST

రాత్రిపూట త్వరగా పడుకొని, తెల్లారి పెందలాడే లేవాలన్నది పెద్దల మాట. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాజా అధ్యయనం ఒకటి మరింత బలపరుస్తోంది. రాత్రిపూట నిద్రించే సమయం తగ్గకుండా.. రోజూ మామూలుగా నిద్ర లేచే సమయానికి గంట ముందుగా లేస్తే కుంగుబాటు (డిప్రెషన్‌) ముప్పు తగ్గించుకోవచ్చని తేలింది మరి. ఈ అధ్యయనంలో 8.4 లక్షల మంది వివరాలను సేకరించి.. ఆలస్యంగా లేచేవారిని, త్వరగా లేచేవారిని వేరు చేశారు. వీరిని నిశితంగా పరిశీలించగా.. ఉదయం పూట గంట ముందుగా లేచే అలవాటు గలవారికి కుంగుబాటు ముప్పు 23% వరకు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కుంగుబాటుతో బాధపడేవారు నిద్ర వేళలను మార్చుకొని, మామూలు కన్నా గంట ముందు లేస్తే ఇబ్బందులు తగ్గుముఖం పడుతున్నట్టు మరో చిన్న అధ్యయనమూ పేర్కొంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని