హరిత ఇళ్లకు తక్కువ వడ్డీకే రుణాలు

పర్యావరణహితంగా ఉండే హరిత గృహాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే హరిత ప్రాజెక్టులకు గృహ రుణ వడ్డీరేట్లలో రాయితీలు ఇస్తున్నాయి.

Published : 29 Jul 2023 00:40 IST

ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం రాజేశ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: పర్యావరణహితంగా ఉండే హరిత గృహాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే హరిత ప్రాజెక్టులకు గృహ రుణ వడ్డీరేట్లలో రాయితీలు ఇస్తున్నాయి. 45 ఏళ్లలోపు వారికైతే రుణాన్ని అధికంగా మంజూరు చేస్తున్నాయి. హరిత గృహలు కొనుగోలు చేసేవారికి వడ్డీరేట్లలో 5 బేసిక్‌ పాయింట్లు, హరిత ప్రాజెక్టులకు 25 బేసిక్‌ పాయింట్లు రాయితీపైన రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజేశ్‌కుమార్‌ తెలిపారు. హైటెక్స్‌లో శుక్రవారం ప్రారంభమైన ఐజీబీసీ గ్రీన్‌ ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడారు.

నెలకు రూ.1500 కోట్ల రుణాలు

దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ పోర్ట్‌ఫోలియో రూ.6.5 లక్షల కోట్లు అయితే హైదరాబాద్‌ వరకు రూ.55వేల కోట్లు.  రాష్ట్రవ్యాప్తంగా రుణాలు అందించేందుకు 26 ఆర్‌ఏసీపీసీలు ఉన్నాయి. గృహరుణాలు, సరసమైన గృహరుణాలు మంజూరు చేస్తుంటాయి. గత ఆర్థిక సంవత్సరంలో 21,714 గృహరుణాలు మంజూరు చేశాం. నెలకు సగటున రూ.1000 కోట్లతో రూ.12వేల కోట్ల విలువైన గృహరుణాలు ఇచ్చాం. ఈ ఏడాది నెలకు రూ.1500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని