ఇంటీరియర్‌ డిజైనర్స్‌ కొత్త కార్యవర్గం

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌(ఐఐఐడీ) హైదరాబాద్‌ ఛాప్టర్‌కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. 2023-25 కాలానికి ఛైర్‌పర్సన్‌గా పల్లవి అంచూరి, కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌ చలసాని, కోశాధికారిగా సీఎస్‌ రాకేశ్‌ వాసు ఎన్నికయ్యారు.

Updated : 16 Sep 2023 02:26 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌(ఐఐఐడీ) హైదరాబాద్‌ ఛాప్టర్‌కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. 2023-25 కాలానికి ఛైర్‌పర్సన్‌గా పల్లవి అంచూరి, కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌ చలసాని, కోశాధికారిగా సీఎస్‌ రాకేశ్‌ వాసు ఎన్నికయ్యారు. శనివారం జరిగే కార్యక్రమంలో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు. 1996లో ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్‌ ప్రాంతీయ ఛాప్టర్‌.. ఇప్పటివరకు 620 మంది సభ్యులతో దేశంలోనే శక్తివంతమైన కమిటీల్లో ఒకటిగా ఉంది.

ఉక్కు ఉత్పత్తి పైపైకి...

ఈనాడు, హైదరాబాద్‌ : ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, నిర్మాణ రంగం పెరుగుతుండటంతో దేశంలో ఉక్కు ఉత్పత్తికి డిమాండ్‌ పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 122.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉక్కును కంపెనీలు ఉత్పత్తి చేశాయి. క్రితం ఏడాది కంటే ఇది 7.6 శాతం అధికం. రాబోయే సంవత్సరాల్లో ఉక్కుకు మరింత డిమాండ్‌ పెరగబోతుంది. 2030 నాటికి 227 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెరుగుతుందని అంచనా. 2050కి 515 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, 2070 నాటికి 750 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు ఉత్పత్తి పెరుగుతుందని అంచనా.

హైదరాబాద్‌లో ధరలిలా.. రెండు వారాల క్రితం కిలోకు ఏడు నుంచి ఎనిమిది రూపాయలు తగ్గగా.. క్రితం వారం ఐదు రూపాయల వరకు పెరిగిందని ట్రేడర్లు చెబుతున్నారు. సాధారణ రకం టన్ను రూ.59వేల వరకు ఉండగా.. మధ్యస్త రకం రూ.62వేలు చెబుతున్నారు. బ్రాండెడ్‌ రకం రూ.70వేలు అంటున్నారు. ఎన్నికలు రాబోతుండటమే ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు