ఆర్థిక సవాళ్లకు ఎదురొడ్డి.. వృద్ధి పథంలో పయనించి

భారతదేశ నివాస రియల్‌ ఎస్టేట్‌ రంగం 2023లో గణనీయంగా ఊపందుకుంది. కొవిడ్‌ అనంతరం 2022లో లభించిన అద్భుతమైన పునరాగమనాన్ని అందిపుచ్చుకుని మార్కెట్‌ వృద్ధిని కనబర్చింది.

Published : 30 Dec 2023 00:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారతదేశ నివాస రియల్‌ ఎస్టేట్‌ రంగం 2023లో గణనీయంగా ఊపందుకుంది. కొవిడ్‌ అనంతరం 2022లో లభించిన అద్భుతమైన పునరాగమనాన్ని అందిపుచ్చుకుని మార్కెట్‌ వృద్ధిని కనబర్చింది. ప్రపంచ అనిశ్చితులు, ఆర్థిక సవాళ్లతో పోరాడుతున్నప్పటికీ, ఈ రంగం గందరగోళాన్ని తట్టుకోవడమే కాకుండా మరింత పటిష్టంగా అడుగులు వేసింది. గృహ విక్రయాల్లో అపూర్వమైన వృద్ధి నమోదైంది. అందుబాటు గృహాలకు స్థిరమైన డిమాండ్‌.. విలాసవంతమైన ఇళ్ల విభాగంలో అద్భుతమైన పెరుగుదల, సాంకేతికత వినియోగం ప్రభావంతో మార్కెట్‌ పరుగులు పెట్టింది. మరి భవిష్యత్తు సంగతేంటి? 2023 నుంచి 2028 వరకు 9.2 శాతం వార్షిక వృద్ధి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి మార్కెట్‌ విలువ ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. 2025 నాటికి దేశ జీడీపీలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా 13 శాతం తోడ్పడుతుందని అంచనా. 2023 మొదటి మూడు త్రైమాసికాల్లో సంస్థాగత పెట్టుబడులు 27 శాతం పెరిగి.. 4.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.


సరసమైన ఇళ్లపై దృష్టి సారించాలి

- జి.హరిబాబు, నరెడ్కో జాతీయ అధ్యక్షుడు

రాబోయే సంవత్సరంలో మేము సవాళ్లను ఎదుర్కొనేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆశావాదంతో ఎదురుచూస్తున్నాం.  సరసమైన గృహాలను అవసరమైన వారికి అందించేందుకు అందరూ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ప్రభుత్వం, పరిశ్రమ మధ్య నిరంతర సహకారంతో పనిచేయాలి. నిర్మాణ నిబంధనలను సడలించడంతో సహా ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు కోసం మా ప్రయత్నం మేం చేస్తూనే ఉంటున్నాం. నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, పన్నులను తగ్గించడం, నూతన ఆవిష్కరణలకు సహాయక వాతావరణాన్ని పెంపొందించాల్సి ఉంది. ఫలితంగా గృహాలను మరింత సరసమైనవిగా చేయడమే కాకుండా సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేస్తుంది. పర్యావరణ స్పృహతో కూడిన కమ్యూనిటీలను రూపొందించడంలో మరింత నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని