ఔషధాల వెల్లుల్లి!

లేత పసుపు రంగులో...  ఘాటుగా ఉండి వంటకాలకు రుచిని అందిస్తుంది వెల్లుల్లి. దాంతోపాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా. అవేంటో తెలుసుకుందామా.

Updated : 30 Nov 2022 10:05 IST

లేత పసుపు రంగులో...  ఘాటుగా ఉండి వంటకాలకు రుచిని అందిస్తుంది వెల్లుల్లి. దాంతోపాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా. అవేంటో తెలుసుకుందామా.

* వెల్లుల్లి జీర్ణక్రియలో తోడ్పడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే బరువు నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

* ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

* రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా రకరకాల ఇన్‌ఫెక్షన్లకు చెక్‌ పెడుతుంది. దగ్గు, జలుబులను దరి చేరనీయదు.

* వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి.

* దీంట్లో మాంగనీస్‌, సెలీనియంలతోపాటు విటమిన్‌-బి6, సి ఉంటాయి. పీచూ తగిన మొత్తంలో ఉంటుంది.

* వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు అల్జీమర్స్‌, డిమెన్షియా లాంటి అనారోగ్యాలను అడ్డుకుంటాయి.

* మూత్ర సంబంధ ఇన్‌ఫెక్షన్లను నిర్మూలిస్తుంది.

* తేనెలో కొన్ని చుక్కల వెల్లుల్లి రసం కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు చనిపోతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని